కెరీర్‌లోనే అత్యుత్తమ ర్యాంకింగ్‌ 5వ ర్యాంక్‌

Rohit Sharma
కెరీర్‌లోనే అత్యుత్తమ ర్యాంకింగ్‌
5వ ర్యాంక్‌
441 పాయింట్లు   
దుబాయ్ : ఐసిసి విడుదల చేసిన తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో రోహిత్‌ శర్మ కెరీర్‌లోనే అత్యుత్తమ ర్యాంక్‌నకు చేరుకున్నాడు .కాగా ఆస్ట్రేలియాతో జరిగిన అయిదు వన్డేల సిరీస్‌లో విశేషంగా ఆడిన టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌శర్మ తన కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంక్‌ను సాధించాడు. ఏకంగా ఆయన ఎనిమిది స్థానాలు ఎగబాకి అయిదవ ర్యాంక్‌కు చేరాడు.కాగా ఆస్ట్రేలి యాతో జరిగిన వన్డే సిరీస్‌లో రోహిత్‌ రెండు అద్బుతమైన సెంచరీల సాయంతో 441 పరుగులను నమోదు చేయడంతో తన ర్యాంకును మరింత మెరుగుపర్చుకున్నాడు.చివరి వన్డేలో 99 పరుగులు చేసిన రోహిత్‌ మరో సెంచరీ చేసే అవకాశాన్ని తృటిలో కోల్పోయాడు. ఆసీస్‌లో రోహిత్‌ తన వ్యక్తిగత ప్రదర్శనతో 59 పాయింట్లు సాధించి అయిదవ ర్యాంకు దక్కించుకోగా,విరాట్‌ కోహ్లీ 64 పాయింట్లు సాధించి తన రెండవ స్థానాన్ని నిలుపుకున్నాడు.ఈ సిరీస్‌ను భారత్‌ 1-4 తేడాతో కోల్పోయిన రోహిత్‌శర్మ మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు దక్కించుకున్న సంగతి తెలిసిందే.ఇదిలా ఉండగా టీమిండియా కెప్టెన్‌ ధోనీ ఏడు స్థానాలు దిగజారి 13వ ర్యాంక్‌నకు పరిమితమయ్యాడు.ఇక టీమిండియా బౌలర్ల విషయానికి వస్తే టాప్‌ -10లో ఎవరూ లేరు.అశ్విన్‌ రెండు స్థానాలు దిగజారి 11 వ స్థానానికి పడిపోగా,భువనేశ్వర్‌ కుమార్‌ ఏడు స్థానాలు పడిపోయి 21వ స్థానానికి పరిమితమయ్యాడు.

కాగా చివరి వన్డేలో టీమిండియా గెలువడంతో రెండవ స్థానాన్ని కాపాడుకుంది.ఆసీస్‌ ఆటగాళ్లలో మాక్స్‌ వెల్‌ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని ఎనిమిదవ స్థానానికి చేరుకోగా,కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌,డేవిడ్‌ వార్నర్‌లు పైకి ఎగబాకి వరుసగా 15,18 ర్యాంకుల్ల నిలిచారు.