కెరీర్‌ను మలుపుతిప్పే మెంటర్‌షిప్‌ కెరీ

CAREER
CAREER

కెరీర్‌ను మలుపుతిప్పే మెంటర్‌షిప్‌ కెరీ

కొండంత సిలబస్‌, పరీక్షలూ, అసైన్‌మెంట్లూ చూసి.. తగని కోర్సు ఎంచుకున్నాం, దాన్ని పూర్తిచేయడానికి కావాల్సిన అర్హతలు తమకు లేవేమోననీ కొందరు దిగాలు పడుతుంటారు. మరికొందరు. ఉద్యోగాన్వేషణ ఏ దిశలో సాగిం చాలో తెలియక తికమకపడుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో వారి పక్కన మెంటర్‌ ఉంటే … సులువైన పరిష్కారాలు ఇట్టే లభిస్తాయి. భవితను మల్చుకోవటంలో అద్భుత సహకారం అందించే ఈ మెంటర్‌షిప్‌ గురించి తెలుసుందాం! విభిన్నమైన కోర్సులూ, సరికొత్త స్పెషలైజేషన్లూ అందుబాటులోకి వస్తు న్నాయి మరోపక్క, ఉద్యోగ సాధనలో పోటీ పెరుగుతోంది.

వీటిని తట్టు కుని విద్యాభ్యాసంలో ఉద్యోగాన్వేషణలో ముందువరసలో నిలబడాలంటే.. అందుకు తగ్గ ఏయూ తప్పనిసరి దీన్ని యక్తిగత శ్రద్ధతో అందించేదే మెం టర్‌షిప్‌, ఇంజినీరింగ్‌, సైన్స్‌ లాంటి వృత్తివిద్యా కోర్సుల విద్యార్థులూ, క్యాం పస్‌ స్టేస్‌మెంట్లకు సిద్ధమయ్యేవారూ మెంటర్ల తోడ్పాటును తీసుకోవచ్చు. ఇంటర్న్‌షిప్‌ చేసే వారు మెంటర్ల ఆలూకు నెట్‌వర్క్‌ను ఉప యోగించుకోవచ్చు. జెఈఈ అడ్వాన్స్‌డ్‌ లాంటి జాతీయ ప్రవేశపరీక్షలు రాసేవారికి మెంటర్‌షిప్‌ ద్వారా అంటే సహాయం మెరుగైన ర్యాంకు సాద µనకు దోహదపడుతుంది. విద్యార్థిలో ఉద్యోగా ర్థిలో ఆత్మవిశ్వాసాన్ని నింప టం లాక్ష్యాన్ని చేరేవరకూ వెన్నంటి ఉంటూ ప్రోత్సహించటం మెంటర్ల విధులు. ఇలాంటివారిని ఎంచుకోవాలి ్య మీరు ఏ స్థాయిలో ఉండాలనుకుంటున్నారో ఆ స్థాయిలో ఉన్నవారిని లేదా మీరు ఆ స్థానా నికి చేరుకోవడానికి తోడ్పడుతారని భావించిన వారిని మెంటర్‌షిప్‌ కోసం ఎంచుకోవాలి. ఆ వ్యక్తి విజయాలు మీకు ప్రేరణ కలిగించేలా ఉండాలి.

్య మెంటర్‌కు మీ కన్నా వేరే అభిరుచులు ఉన్నప్పటికీ వారు మీ దృష్టికోణంలో అవసరమైన మార్పులు తేగలరు. ్య లింగ భేదం ఉండాల్సిన అవసరం లేదు కానీ విద్యార్థినులకు స్త్రీలు, విద్యార్థులకు పురుషులూ మెంటర్లుగా ఉండటం ఎక్కువ ప్రయోజనకరం ్య నిజాయతీ మెంటర్‌షిప్‌లో కీలకం మెంటర్‌, మెంటీ (విద్యార్థి) ఇద్దరికీ ఇది అవసరం. అయితే మీరు చేసిన తప్పులను మెంటర్‌ నిష్పంకోచంగా చెప్పగలిగినప్పుడే మీకు వాటిని సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంది. ్య ఎక్కువ అనుభవం,

విస్తృత నెట్‌వర్క్‌ కలిగివ్ఞన్నవారై ఉద్యోగాన్వేషణ సమయంలో వారి నెట్‌వర్క్‌ మీకు సాయపే అవకాశముంది. ్య ఒక స్థాయికి చేరినవారినే ఎంచుకుంటే ఉప యోగకరం కానీ మెంటర ్‌షిప్‌లో వారు మీకు వీలైనంత సమయం కేటాయించగలిగినవారై ఉండాలి. ఎలా సాయపడగలరు? మెంటర్లకు విద్యార్థి (మెంటీ) కంటే ఎక్కువ అను భవముంటుంది. విద్యార్థి ఇప్పుడు ఎదుర్కొం టున్న దశలు వారు ఇంతకుముందే దాటి ఉం టారు. విద్యార్థి తన శక్తి సామర్థ్యాలను ఏ దిశ లో ఉపయోగించాలో తెలియజేస్తూ అనవసర విషయాలను పక్కన పెట్టడంలో మెంటర్లు సాయపడతారు. సమతూకం నేర్పుతారు చాలామంది విద్యార్థులు విద్య ప్రొఫెషనల్‌, సాంఘిక వ్యక్తిగత వంటి వివిధ అంశాలను సమతూకంలో నిర్వహించడంలో తొట్రుపడు తుంటారు. అలాంటి పరిస్థితుల్ల ఉన్నవారి మెంటర్‌ సాయపడతారు. సహనంతో ఎలా నడుచుకోవాలో సూచిస్తూ సమతూకంగా నిర్వహించేలా సాయపడ తాయి.

స్థిర లక్ష్యం ఉండి కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని కలిగివ్ఞంటే మెంటీ రియర్‌లో అభివృద్ధి చెందడానికి వసరమైన పరిచయాలను అందిం చడం లో మెంటర్‌ ఎప్పుడూ ముందుంటారు. తనకు అందుబాటులో ఉన్న వన రులన్నీ ఉపయోగించి తన కెరియర్‌కు అవసరమైన బాటను చూపిస్తారు. ఉద్యోగ మార్కెట్‌లోకి ప్రవేశించే క్రమంలో మెంటర్లు ఎక్కువ ఉపయో గపడతారు.

నిజానికి విదార్థి జీవితం నుంచి ఉద్యోగ జీవితంలోకి ప్రవే శించడానికి చాలామంది ఎంతో కష్టపడుతుంటారు. ఒకరకంగా మెంటర్‌ విద్యార్థికి ఈ ప్రక్రియను సులభతరం చేస్తారు. ఈ రకంగా మెం టర్‌ను కలిగివ్ఞన్నవారు ఉద్యోగ విషయంలో మిగతావారితో పోలిస్తే అడుగు ముందున్నట్లే. ఆలోచనలు పంచుకుంటారు భవిష్యత్తును విజయవంతం చేసుకునే సుదీర్ఘమైన ఒడిదొడుకుల మార్గంలో కొన్నిసార్లు దారి తప్పడమో తప్పు దారిలో ప్రయాణించడమో జరుగు తోంది. అలాంటప్పుడు భావోద్వేగాలు, భావనలు, భయాలను ధైర్యంగా పంచు కోవ డానికిఒకరుంటే బాగుంటుందనే భావన విదార్థి దశలో సాధారణమే తను ఎదుర్కొంటున్నవన్నీ లా చిన్న షయాలనీ, వాటిని సులువ్ఞగా ఎదుర్కొవచ్చనీ తెలియజేస్తనే విద్యార్థి సంబంధించిన క్లిష్టమైన విషయాల్ల మెంటర్‌ స్పష్టతను తీసుకువస్తారు.

ప్రొఫెషనల్‌ లీడర్‌షిప్‌ ఇంటర్‌ పర్సనల్‌ నైపుణ్యాలు సామర్థ్యాలను పెంచు కునే విషయంలో రోల్‌మోడల్‌గా నిలుస్తారు. ఆత్మవిశ్వాసాన్ని పెంచి, ఉన్నత లక్ష్యాలను చేరుకోవడంలోనూ, రిస్క్‌లను ఎదుర్కొంటూ ఉన్నతస్థాయికి ఎదగడంలోనూ తోడ్పాటును అం దిస్తారు. వైవిద్యభరిత మైన దృష్టికోణాలు, పెం చుకోవడానికి ఉపయోగపడతారు. ఉద్యోగ జీవితంలోనూ సానుకూల ప్రభావం మెంటర్‌షిప్‌ చూసే ప్రభావం గురించి కాలి ఫోర్నియా కేంద్రంగా పనిచేసే ఒక పరిశోధన సంస్ధ ఆధ్యయనం జరిపింది. 1000 మందిక ిపైగా ఉద్యోగులపై అయిదేళ్లపాటు దీన్ని నిర్వ హించారు. ్య మెంటర్‌షిప్‌ కార్యక్రమంలో పాల్గొన్న బ్దృంంలో 25% మంది (ఎలాంటి మెంటర్‌షిప్‌ అందుకోని 5% మందితో పోల్చినపుడు) మెరుగైన వేతనాలు అందుకున్నారు.

72% మంది తమ స్థానాలను (ఈ కార్య కమంలో పాల్గొనని 49% మందితో పోల్చినపుడు) నిలబెట్టుకున్నారు. ్య పదోన్నతికి సంబంధించి మిగిలినవారితో పోల్చినపుడు మెంటర్‌షిప్‌ అందుకున్నవాళ్లు 5 రెట్లు ఎక్కువగా అవకాశాలు పొందారు. ఎలా ముందడుగు వేయాలి? కుటుంబ సభ్యులు సీనియర్లు కళాశాల అధ్యాపకులు ఇలా ఎవరైనా మెంటర్‌ కావొచ్చు. సాధారణంగా వీళ్లు విద్య వృత్తిపరంగా పురోగతి సాధిం చడానికి కావాల్సిన విజ్ఞానంతోపాటు సూచనలు. సలహాలు ఇచ్చే స్థితిలో ఉండాలి.

అందుకనే విద్యార్థులు వీరిని ఎంచుకోవడం ముఖ్యమైన అంశం. కళాశాల సీనియర్‌ విద్యార్థులూ, ప్లేస్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులూ మెంటర్‌షిప్‌ విషయంలో సహకారం అందిస్తారు. క్రమం తప్పకుండా సెమి నార్లకూ, కన్ఫరెన్యులకూ హాజరవ్ఞతుంటే అక్కడకు విశేష పరిజ్ఞానమున్నవారు వస్తుంటారు. వారిని పరిచయం చేసుకోవాలి. వారి సలహా సూచనలను అడగాలి. మీరు ఎదుర్కొంటున్న సమస్యను చెప్పి ఇప్పటి వరకూ ప్రయత్నించిన పరిష్కారాల గురించి చెప్పాలి. మెంటర్‌గా ఉండ మని నేరుగా వారిని అడగకుండా వారిని ఆసక్తికరమైన ప్రశ్నలు వేసి అకట్టు కోవాలి. వారే క్రమంగా ఈపై ఆసక్తి చూపించవచ్చు. ఈరకంగా వారు మీ మెంటర్‌ అయ్యే అవకాశాలుంటాయి. Quora, Linkedin మొదలైన ఆన్‌లైన్‌ వేదికలు కూడా సరైన మెంటర్‌ను కనుగొనటానికి ఉపయోగపడ తాయి.www.procademia.com లాంటి వెబ్‌సైట్ల సహాయం కూడా పొందవచ్చు.