కెన్యాలో పాఠశాలలో కాల్పులు:6గురు విద్యార్థులు సహా ఏడుగురు మృతి

Shot dead
Shot dead

కెన్యాలోని ఒక పాఠశాలలో దుండగులు జరిపిన కాల్పుల్లో ఆరుగురు విద్యార్థులతో సహా ఏడుగురు మరణించారు. కెన్యా సరిహద్దుల్లో ఉన్న లోకిచొగియో మిక్స్‌డ్‌ సెకండరీ స్కూల్‌లో సాయుధులైన కొందరు దుండగులు ప్రవేశించి పాఠశాల ప్రిన్సిపాల్‌, సస్పెండైన ఒక విద్యార్థి కోసం చూశారని, వారు కనిపించకపోవడంతో ఇష్టం వచ్చినట్లు కాల్పులు జరిపారని పోలీసులు చెప్పారు. కాల్పులు జరిపిన వారిలో అదే పాఠశాలకు చెందిన సీనియర్‌ విద్యార్థి ఒకరు ప్రధాన అనుమానితుడని రిఫ్ట్‌ వ్యాలీ ప్రాంతీయ నేర పరిశోధనా సంస్థ అధిపతి గిడియాన్‌ కిబుంజా చెప్పారు.