కెటిఆర్‌ ట్వీట్‌లో భూ బదలాయింపు

Nirmala sitaraman & KTR
Nirmala sitaraman & KTR

హైదరాబాద్‌: కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌ తెలంగాణ రాష్ట్రమంత్రి కెటిఆర్‌ ట్వీట్‌కు స్పందించారు. రక్షణశాఖ భూముల బదలాయింపు విషయంపై మంత్రి కెటిఆర్‌ ట్వీట్‌ చేయడంతో కేంద్రమంత్రి నిర్మలా స్పందించారు. రక్షణశాఖ భూముల బదలాయింపుపై తమకు ఎలాంటి సందేహాలు లేవన్నారు. అధికారులు వివరాలన్నీ సేకరించి ఖరారు చేస్తారని ఆమె పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల విషయంలోనూ ఇలాగే వ్యవహరించమని కేంద్రమంత్రి తెలిపారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్‌కు మంత్రి కెటిఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. హైదరబాద్‌ ప్రజాప్రయోజన దృష్ట్యా త్వరితగతిన సమస్యను పరిష్కరించాలని కేంద్రమంత్రికి ట్వీట్‌ ద్వారా విన్నవించారు.