కెటిఆర్‌ను ఇంటికి ఆహ్వానించిన ఒమర్‌ అబ్దుల్లా

 

KTR, Omar Abdullah
KTR, Omar Abdullah

హైదరాబాద్‌: జమ్ముకశ్మీర్‌ మాజీ సిఎం నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఒమర్‌ అబ్దుల్లా మంచు అందాల నడుమ ఉన్న తన ఇంటి ఫోటోను ట్విటర్‌లో పోస్టు చేశారు. ఫోటోను చూడగానే కెటిఆర్‌ కు బాగా నచ్చి వెంటనే ఒమర్‌ ట్విట్‌కు స్పందిస్తూ… . ఒకవేళ కోరికలు నెరవేర్చే ఫ్యాక్టరీ గనుక ఉంటే.. నేను ఈ క్షణమే అక్కడ ఉండేవాడినిగ అని ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌ చూసిన ఒమర్‌..కెటిఆర్‌ ను సాదరంగా తన ఇంటికి ఆహ్వానించారు. మా ఇంటిని మీ ఇల్లే అనుకోండి. మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఇక్కడ ఉండొచ్చుగ అని ఒమర్ ఆహ్వానం పలికారు. ఇందుకు కెటిఆర్‌ ..ఒమర్‌ సాబ్‌ మీ ఆఫర్‌ను నేను సీరియస్‌గానే తీసుకుంటాను మరీ.. అని నవ్వుతూ బదులిచ్చారు.