కెజిబివీలు ఇంటర్‌ స్థాయికి పెంపు

KGBV
KGBV

హైదరాబాద్‌: తెలంగాణలో బాలికలకు శుభవార్త. రాష్ట్రంలో ఉన్న 87కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాలను ఇంటర్‌ స్థాయికి పెంచుతూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2018-19 నుంచి ఇంటర్‌ తొలి ఏడాది, 2019-20 నుంచి రెండో ఏడాది తరగతులు ఆరంభం కానున్నాయి. తెలుగు మాధ్యమంలో ఎంపిసి, బైపిసి, సిఈసి గ్రూపుల్లో 420చోప్పున సీట్లు కేటాయించారు. కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలాయలను ఇంటర్‌స్థాయికి పెంచడంతో విద్యార్థినీలు హర్షంవ్యక్తం చేస్తున్నారు.