కృష్ణా జిల్లాలో కుంభ‌వృష్టి

rain fall
rain fall

గన్నవరం: కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తోంది. గన్నవరం నియోజకవర్గంలో గత అర్థరాత్రి నుంచి చిరుజల్లులతో ప్రారంభమైన వర్షం కుండపోతగా వర్షం కురుస్తోంది. ఈ వర్షం రైతులకు ఎంతో మేలు చేస్తుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నాట్లు దశలో ఉన్న వరి పంటకు వర్షపునీరు బలాన్ని ఇస్తుందని అన్నదాతలు ఆశాభావం వ్య‌క్తం చేశారు.