కృష్ణా, గుంటూరుకు చెందిన నేతలు జనసేనలో చేరిక

Pawan Kalyan
Pawan Kalyan

విజయవాడ: తమ పార్టీకే గనుక 10 మంది ఎమ్మెల్యేలు ఉండి ఉంటే అసెంబ్లీలో నిలబడేవాడినని, వైఎస్‌ఆర్‌సిపిలా పారిపోయేవాడిని కాదని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. విజయవాడలో పార్టీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కృష్ణా, గుంటూరు జిల్లాకు చెందిన పలువురు నేతలు పవన్‌ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ…రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేందుకే పార్టీని స్థాపించానని అన్నారు. గత ఎన్నికల్లో పోటీ చేయాలని తాను అనుకున్నప్పటికీ ఓట్లు చీలుతాయని చంద్రబాబు చెప్పడంతో ఆగిపోయానని తెలిపారు. రైతుల నుంచి బలవంతపు భూసేకరణ చేపడితే ఊరుకునేది లేదన్నారు.