కృష్ణాలో పడవ మునక… 12మంది మృతి

విజయవాడ: కృష్ణా జిల్లా ఇబ్రాహీంపట్నం ఫెర్రీ పాయింట్ వద్ద విషాద ఘటన చోటుచేసుకుంది. కృష్ణా నదిలో
సుమారు 35 మందితో ప్రయాణిస్తున్న బోటు ప్రమాదవశాత్తు తిరగబడి 12 మంది మృత్యువాత పడ్డారు. కృష్ణా
పవిత్ర సంగమం వద్ద హరతి చూసేందుకు రివర్ బోటింగ్ సంస్థకు చెంది బోటులో ప్రయాణిస్తుండగా ఈ ఘటన
చోటు చేసుకుంది. సామర్థ్యానిక మించి ప్రయాణీకులు ఉండటంతో ఈ బోటు తిరగబడిందని తెలుస్తోంది. మృతుల్లో
ఒంగోలుకు చెందిన వారని తెలుస్తోంది. ఇప్పటికే ఎన్డిఆర్ఎఫ్ బృందం ఘటనాస్థలికి చేరుకుంది. సహాయక చర్యలు
కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో మొత్తం 28మంది ప్రయాణీకులు గల్లంతయ్యారు. చీకటి కావడంతో గాలింపు
చర్యలకు అవరోధం ఏర్పడుతుంది.