కృష్ణానదిలో నలుగురు గల్లంతు

KRISHANAF

కృష్ణానదిలో నలుగురు గల్లంతు
కోడూరు: కృష్ణానదిలో నలుగురు యువకులు గల్లంతయ్యారు. నలుగురిలో ఒకరి మృతదేహాన్ని గుర్తించారు. ఇంకా ముగ్గురి ఆచూకీ కోసం మత్స్యకారులు, పోలీసులు గాలిస్తున్నారు. గుంటూరుజిల్లా చేబ్రోలు మంలడం సుద్దపల్లికి చెందిన వవన్‌కుమార్‌, జయకృష్ణ, సింగరయ్య , నాగరాజు నలుగురు యువకులు కృష్ణాజిల్లా కోడూరు మండలం విశ్వనాధపల్లి వద్ద నదిలో సాన్నానికి వెళ్లి గల్లంతయ్యారు. మరో ముగ్గురు కూడ మృతిచెంది ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.