కృష్ణగాడి వీర ప్రేమకథ ఫస్ట్‌లుక్‌ విడుదల

Krishna Gadi Veera Prema Gadha
నమో వెంకటేశ, దూకుడు, 1 నేనొక్కడినే, లెజెండ్‌, పవర్‌ (కన్నడం), ఆగడు, వంటి భారీ బడ్జెట్‌ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై ప్రొడక్షన్‌ నం7గా యంగ్‌ హీరో నాని, మెహరీన్‌ (నూతన పరిచయం) హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం కృష్ణగాడి వీర ప్రేమగాథ ఫస్ట్‌ లుక్‌ ఈ రోజు విడుదలైంది. భలే భలే మగాడివోయ్ వంటి సక్సెస్‌ ఫుల్‌ చిత్రం తర్వాత నాని హీరోగా నటిస్తున్న చిత్రమిది. అందాల రాక్షసి వంటి డిఫరెంట్‌ లవ్‌ స్టోరీతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన యంగ్‌ డైరెక్టర్‌ హను రాఘవపూడి దర్శకుడిగా ఈ ఎగ్జయిటింగ్‌ ఎంటర్‌ టైనింగ్‌ లవ్‌ స్టోరీ తెరకెక్కుతోంది. రామ్‌ అచంట, గోపీచంద్‌ అచంట, అనిల్‌ సుంకర నిర్మాతలు. ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ రత్నవేలు అసిస్టెంట్‌ యువరాజ్‌ సినిమాటో గ్రఫీని అందిస్తున్నారు. ఎ.ఆర.రెహమాన్‌ మ్యూజిక్‌ స్కూల్‌కు చెందిన విశాల్‌ చంద్రశేఖర్‌ మ్యూజిక్‌ అందిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని ఘనంఆ నిర్వహించనున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఒక సాంగ్‌ మినహా సినిమా షూటింగ్‌ పూర్తయిందని చిత్ర నిర్మాతలు తెలియజేశారు. నాని, మెహరీన్‌, సంపత్‌, మురళీ శర్మ, బ్రహ్మీజీ, పథ్వీ, శత్రు, హరీష్‌ ఉత్తమన్‌, బేబి నయన, మాస్టర్‌ ప్రతాప్‌, బేబి మోక్ష తదితరులు తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: యువరాజ్‌, సంగీతం: విశాల్‌ చంద్రశేఖర్‌, ఫైట్స్‌: విజయ్, డ్యాన్స్‌: రాజు సుందరం, ఎడిటర్‌: వర్మ, ఆర్ట్‌, అవినాష్‌ కొల్ల, లైన్‌ ప్రొడ్యూసర్‌: హరీష్‌ కట్టా, లిరిక్స్‌: కె.కె.(కష్ణకాంత్‌), కో డైరెక్టర్‌: సాయి దాసం, డైలాగ్స్‌: హను రాఘవపూడి, జయకృష్ణ, నిర్మాతలు: రామ్‌ అచంట, గోపీచంద్‌ అచంట, అనిల్‌ సుంకర, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : హను రాఘవపూడి.