కృత్రిమ మేధస్సుదే ప్రతిభ

AP
AP CM CHANDRA BAU REVIEW

కృత్రిమ మేధస్సుదే ప్రతిభ

నూతన సాంకేతికతతోనే రాష్ట్రాభివృద్ధి
కాలానుగుణంగా విధానాలు: సిఎం చంద్రబాబు

అమరావతి: కృత్రిమ మేథస్సు, రోబో టె క్నాలజీవంటి అధునాతన సాంకేతిక రంగాలలో వేలకోట్ల రూపా యలు పెట్టుబడులు తరలిరానున్నాయని, వాటిని అందిపుచ్చు కునేలా రాష్ట్ర ప్రభుత్వ విధానాలు రూపొందించుకోవాల్సి వుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఐటీశాఖ అధికారులకు సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వ విధా నాలలో ఎప్పటికప్పుడు నూతనత్వం వుండాలని అన్నారు. రాష్ట్రం ఐటీ, ఐవోటీకి ప్రాధాన్యత ఇస్తున్నందున అంతర్జాతీయ సంస్ధలు మొగ్గు చూపే అవకశం వుందని చెప్పారు. శనవారం ఐటీశాఖ మంత్రి లోకేష్‌తో కలిసి ముఖ్యమంత్రి సచివాలయంలో స్టేట్‌ ఇన్వెస్టుమెంట్‌ ప్రమోషన్‌ బోర్డుపై సమీక్ష నిర్వహించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ రాష్ట్రంలో ఐటీ రంగ అభివృద్ధికి తాను తీసుకున్న చర్యలను ముఖ్యమంత్రి సమీక్షలో వివరించారు. ఐటీ కంపెనీలను రాష్ట్రానికి తీసుకురావడానికి ఎన్నో ప్రయాసలు పడ్డానని, ఐటీ కంపెనీల ప్రతినిధులకు తన ఇంటిలో ఆతిథ్యం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఐటీ గురించి అంతగా అవగాహన లేకున్నా, సమా చారం సేకరించి అధ్యయనం చేసినట్టు తెలిపారు. అంతర్జాతీయ విమాన సర్వీసులు లేని రోజుల్లో హైదరాబాద్‌కు తొలి ఎమిరేట్స్‌ విమాన సర్వీసు తీసుకురావడానికి ఎంతో శ్రమించాల్సి వచ్చిందని చెప్పారు. డిగ్రీ కోర్సుల్లో ఐటీని సబ్జెక్టుగా ప్రవేశపెట్టాలి: ఇటీవలే ఫిన్‌టెక్‌, అగ్రిటెక్‌, ఎడ్యుకేషన్‌ ఈవెంట్లు విజయవంతం చేశామని, ప్రతినెలా ఎదో ఒక సదస్సు నిర్వహించడం ద్వారా అంతర్జాతీయ సంస్ధలను ఆకట్టుకోవచ్చని ముఖ్యమంత్రి చెప్పారు.అన్ని డిగ్రీ కోర్సుల్లోనూ ఐటీని ఒక సబ్జెక్టుగా ప్రవేశపెట్టాలని అధికారులకు సూచించారు.

అగ్రికల్చర్‌, మెడికల్‌ వంటి వృత్తి విద్యా కోర్సుల్లోనూ ఐటీని తప్పనిసరి చేయాలని నిర్ధేశించారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజి నెస్‌ల మెరుగైన ఫలితాలు సాధించేందుకు ‘లా క్వాన్‌ యూని వర్సిటీ సహకారాన్ని తీసుకోవాలని సూచించారు. ప్రతి నియో జకవర్గంలో ఎంఎస్‌ఎంఈలు నెలకొల్పేందుకు యువతకు శిక్షణ ఇవ్వాలని చెప్పారు. ఎలక్ట్రానిక్‌ పరిశ్రమలకు ప్రోత్సాహం: మంత్రి నారా లోకేష్‌ ఎలక్ట్రానిక్‌ పరిశ్రమల్ని పెద్దఎత్తున ఆకర్షిస్తున్నామని, సిలికాన్‌ క్వారి డార్‌ పేరుతో ఎలక్ట్రానిక్‌ కంపెనీలను ప్రోత్సహిస్తున్నామని మంత్రి లోకేష్‌ వివరించారు.

రానున్న భాగస్వామ్య సదస్సులో పెద్దఎత్తున ఎలక్ట్రానిక్‌ పరిశ్రమలు రాష్ట్రంతో అవగాహన ఒప్పందాలు కుదు ర్చుకోనున్నాయని ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. తన అమెరికా పర్యటనలో విశాఖలో సెంటర్‌ ఏర్పాటు చేసేలా గూగుల్‌ ఎక్స్‌తో ఎంవోయూ చేసుకున్నామని, తిరుపతిలో సాఫ్ట్‌వేర్‌కంపెనీ జోహూె జనవరిల ప్రారంభం కానుందని తెలిపారు. ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌తో సంప్రదింపులు ముగిసాయని, విశాఖలో డెవలప్‌ మెంట్‌ సెంటర్‌ ప్రారంభించేందుకు ఆ సంస్ధ అంగీకారం తెలిపిందని వెల్లడించారు. ఇప్పటికే తమిళనాడులో తమ యూనిట్‌ నెలకొల్పిన ప్రమఖ ఎలక్ట్రానిక్స్‌ తయారీ కంపెనీ ఫ్లెక్స్‌ట్రానిక్స్‌ ఆంధ్రµప్రదేశ్‌ లోనూ అడుగుపెట్టేందుకు సిద్ధంగా వుందని చెప్పారు.