కూరగాయల్ని కొనేముందు…

veg1
Vegitables

కూరగాయల్ని కొనేముందు…

కూరగాయల కొనుగోలుకు బజారుకి వెళుతున్నారా? చూడటానికి అన్ని కూరగాయలూ బాగానే ఉంటాయి. కాని అవి తాజావో, నిలవ సరుకో చాలా తక్కువ మందికే తెలుస్తుంది. తొందరపడి నిల్వ సరుకు తెచ్చుకుంటే తరువాత పారవేయాల్సి వస్తుంది. వాటి తాజాదనం గుర్తించేందుకు కొన్ని సూచనలు… బ వంకాయ రంగు లేదా మంచి ఎరుపు రంగులో కనిపిస్తూ పై తొక్క పగుళ్లు లేకుండా ఉంటే బీట్‌రూట్‌లు తాజావి అని అర్థం. క్యాబేజీలను ఎప్పుడూ చిన్నవిగానూ, గుండ్రంగానూ ఉండే వాటినే కొనుగోలు చేయాలి.

కాలీఫ్లవర్‌లో చీలికలు, పగుళ్లు ఉంటే మనం తినటానికన్నా ముందుగా, క్రిములు వాటిని తినేందుకు లోపలికి ప్రవేశించాయని గమనించండి. గాజర్‌ తాజాగా ఉందని తెలుసుకునేందుకు ముదురు కుంకుమపువ్ఞ్వ రంగులో ఉండటం అవసరం. పై పొర పూర్తిగా శుభ్రంగా స్పష్టంగా కనిపించాలి. గాజర్‌ చలికాలంలో బాగా దొరుకుతుంది. బ వెల్లుల్లి పై పొరలు ఎండిపోయినట్లుగానూ, లోపలి రేకులు గుండ్రంగా ఉన్నట్లుగానూ, గట్టిగానూ కనిపిస్తే అవి తాజావి. బ పుట్టగొడుగులు కాస్త మెత్తగానూ, గుండ్రంగానూ, జిడ్డుగానూ ఉండాలి. ఉల్లిపాయలు గట్టిగానూ, ఎండిపోయి గులాబీ రంగుతోనూ పై పొర జిడ్డుగానూ ఉండాలి. బ బఠాణీలు కాస్త మెత్తగానూ, మృదువ్ఞగానూ, రంగు పచ్చగానూ ఉండాలి. బ బంగాళా దుంపలు గట్టిగా పై పొర జిడ్డుగానూ ఉండాలి.

పగుళ్ల చూపిన పై పొరగలవీ బయటికే నల్లగా కనిపించేవీ, మట్టితో నిండినట్లుగా కనిపించేవీ అయితే వాటిని కొనుగోలు చేయకూడదు. బంగాళాదుంపల నుంచి వేళ్లు వచ్చిన వాటినీ తీసుకోకూడదు. బ పాలకూర ఆకులు శుభ్రంగా మెత్తగా ముదురు ఆకుపచ్చరంగులో ఉండాలి, పసుపు రంగులోకి మారిన ఆకులున్న కట్టలను కానీ, రంధ్రాలూ, చీలికలూ ఉన్న ఆకును ఎంపిక చేసుకోకూడదు. బ కాస్త లావ్ఞగా, గుండ్రంగా, ఎర్రగా నిగనిగలాడుతున్న టమాటాలనే తీసుకోవాలి. మచ్చలు నల్లని గుర్తులున్న వాటినీ మెత్తబడిపోయిన వాటిని తీసుకోకూడదు.

ఫ్రెంచ్‌ బీన్స్‌ను పచ్చని పచ్చివాటినే ఎంపిక చేసుకోవాలి. కొనుగోలు చేసేటప్పుడు చేత్తో తాకి, గుండ్రంగా ఉన్నాయో లేదో ఓసారి చూడాలి. బ చిన్నచిన్నవీ, పొడుగాటివీ అయిన బెండకాయలనే ఎంపిక చేసుకోవాలి. వాటిమీద ఎక్కువగా నల్లని మచ్చలుండకూడదు. తొడిమలను వేళ్లతో విరిచి చూడాలి. చటుక్కున విరిగితే బెండకాయలు పూర్తిగా తాజావైనట్లు మరో పద్ధతి కూడా ఉంది. చేత్తో తాకితే మెత్తగా ఉండి, దాని నూగు చేతికి తగులుతూ ఉంటుంది. అలాంటివైనా తాజావే. బ కొత్తిమీర, మెంతికూరల ఆకులు చేతికి మెత్తగా తగులుతూ, పచ్చగా ఉండాలి. వాడిపోయిన, పసుపు రంగులలోకి వచ్చిన కూరలను కొనకూడదు. ఎందుకంటే వాటిలో, వాటికి సహజంగా ఉండే సువాసన ఉండదు. ఎక్కువగా నీటితో తడిపి బరువెక్కిన కట్టలూ తీసుకోకూడదు. నీరెక్కువగా ఉండటం చేత, అవి త్వరగా పాడైపోతాయి.

ఇంటికి తెచ్చాక వేర్లు, వాటి మధ్యలో ఉండే గడ్డీ, వగైరా తీసేశాక కాయితంలో చుట్టి నిల్వ చేసుకోవాలి. కాస్త పెద్ద నిమ్మకాయలనే తీసుకోవాలి. వాటి తొక్కలు పలుచగానూ, జిడ్డుగా మెరుస్తూనూ ఉండాలి. నల్లని మచ్చలున్న వాటిని ఎంపిక చేసుకోకూడదు. పలుచగా ఉండే సొరకాయనే తీసుకోవాలి. పై తొక్క తేలిక పచ్చ రంగులో ఉండాలి. కాస్త జిడ్డుగానూ అనిపించాలి. బ పొడుగాటి దొండకాయలనే తీసుకోవాలి. ముదురు ఆకుపచ్చరంగులో ఉండాలి. బ బీరకాయలు నవనవలాడుతూ గోటితో గిల్లితే చటుక్కున దిగిపోయేవిగా మెత్తగా ఉండాలి. పచ్చగా లేకపోయినా, విరిగిపోయినా కొనుగోలు చేయకూడదు.