కూటమి రాజకీయాల్లో తలమునకలైన నీరో చక్రవర్తి

Vijayasai Reddy
Vijayasai Reddy

చంద్రబాబుపై విజయసాయిరెడ్డి ద్వజం
హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో కనీవినీ ఎరుగని రీతిలో కరువు తాండవిస్తుందని, 320 మండలాలలో కరువు తాండవం చేస్తుంటే నీరో(నారా) చక్రవర్తి మాత్రం కూటమి రాజకీయాల్లో తలమునకలై పోయారని వైఎస్సార్సీ ఎంపి విజయసాయిరెడ్డి ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. రాష్ట్రంలో కరువు తాండవం చేస్తుందని, ఆఉకునే దిక్కులేక సీమలో వేల సంఖ్యలో వలసలు మొదలయ్యాయని అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఊళ్లకు ఊళ్లు ఖాలీ అవుతున్నాయని, అన్నదాల ఆక్రోశం, ఆవేదను నీరో చక్రవర్తి పట్టించుకోవడం లేదని ట్విట్టర్‌ వేదికగా ద్వజమెత్తారు.