కూటమి నేతలతో రేపు కీలక భేటీ

AP CM BABU
AP CM BABU

కూటమి నేతలతో రేపు కీలక భేటీ

అమరావతి: ఇటీవల దేశంలో ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల నేపధ్యంలో ఎన్డీఎ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలు ఉంటాయని సంబంధిత సర్వే సంస్థల ప్రకటనలతో దేశ రాజకీయాల్లో టిడిపి జాతీయ అధ్యక్షుడు, సిఎం చక్రం తిప్పనున్నారు. సోమవారం హస్తినలో కూటమి నేతలతో బాబు భేటీకానున్నారు.బిజెపీయేతర పార్టీనేతలను బాబు ఏకతాటిపైకి తీసుకురావడా నికి గత రెండుమాసాలుగా చేస్తున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి రానున్నాయి. ఈనేపధ్యంలో ఎన్డీయేపై ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోడీపై జాతీయ స్థాయిలో విపక్షాలు మూకుమ్మడి దాడికి సిద్ధపడుతున్నాయి.దేశంలో మొట్ట మొదటిసారిగా తెలుగుదేశం పార్టీఅధినేత ప్రధాని నరేంద్రమోడీ కేంద్రంపై ఎదురు తిరగడం విభజనచట్టం హామీలు, ప్రత్యేక హోదా కోసం బాబు భయపడకుండా మోడీపై తిరగబడడంతో జాతీయస్థాయిలో విపక్షాలకు ధైర్యంకల్గి బాబుతో విపక్షాలు చేతులు కలపడానికి ముందుకొచ్చారు. కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షమైన యూపిఎ అధినేత్రి సోనియాగాంధీ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీలు అడపాదడపా కేంద్రంపై ఒంటరిపోరు చేస్తున్నా వారిపోరుకు కేంద్రం దిగిరాలేదు.బాబు జాతీయస్థాయిలో విపక్ష పార్టీలతోసహా జాతీయ పార్టీయైన కాంగ్రెస్‌పార్టీతో సంప్రదింపులుచేసి మూడవ కూటమి ఏర్పాటుకు గతనెల 1న ఏకంగా రాహుల్‌గాంధీతో బాబు భేటీ కావడం ఆయన బాబుతో చేతులు కలపడానికి ముందుకొచ్చారు. ఈ నేపధ్యంలో బాబు కూడా ఆచీతూచీ అడుగులు వేస్తూ కాంగ్రెస్‌పార్టీతో వైరంఉన్న జాతీయస్థాయిలోని హేమా హేమీలను కలసి తమ పార్టీ ఆవిర్భవించిందే కాంగ్రెస్‌పార్టీని అంతం చేయడమే ధ్యేయంగా పనిచేస్తూ వచ్చామని ప్రస్తుత దేశరాజకీయాల్లో మోడీ చర్యలతో అందరం ఏకం కాకతప్పదని దేశభవిష్యత్తు కోసం జాతీయస్థాయిలో ప్రజా స్వామ్యాన్ని కాపాడేందుకు కాంగ్రెస్‌పార్టీతో జాతీయస్థాయిలో వైరం కల్గిన పార్టీల నేతలను కూటమిగా ఏర్పడడానికి అందర్ని ఒప్పించారు. ఇటీవల జరిగిన రాజస్థాన్‌,మధ్యప్రదేశ్‌,చత్తీస్‌ఘడ్‌,మిజోరాం,తెలంగాణా రాష్ట్రాల ఎన్నికల్లో బిజేపికి ఎదురుగాలివిస్తోందని బిజేపి అంచనాలు తల్లకిందు లవుతున్నట్లు ఎగ్జిట్‌ పోల్స్‌ స్పష్టంచేయడంతో కూటమి ప్రారంభంతో బిజేపి గ్రాఫ్‌ జాతీయస్థాయిలో పడిపోతుందని బాబు కూటమిని సోమవారం ఢిల్లీలో సమావేశపరిచి అన్ని పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చి మంగళవారంనుండి ప్రారంభమయ్యే శీతాకాలం సమావేశాల్లో విపక్షాలన్నీ కేంద్రంపై ఢీ అంటే ఢీ అంటూ ముందుకు సాగాలని 2019ఎన్నికలను దృష్టిలోపెట్టుకొని విపక్షాలన్నీ కూటమిగా ఎదగకపోతే ఎన్డీయేని గద్దెదించలేమని బాబు దేశస్థాయిలోని సీనియర్‌ నాయకులకు నచ్చజెబుతూ గత మూడు రోజులనుంచి కూటమి సమావేశంపై జాతీయస్థాయిలోని మాజీ ప్రధాని దేవేగౌడ, ఫరూక్‌ అబ్దుల్లా, శరత్‌పవార్‌,మమతా బెనర్జీ, శరద్‌యాదవ్‌, ఉభయకమ్యూనిస్టు నేతలు రాజా, సీతారాం ఏచూరి, సురవరం సుధాకర్‌రెడ్డి, నారాయణలతోపాటు 17పార్టీలకు చెందిన నేతలతో బాబు టెలీఫోన్‌ద్వారా తెలియజేసినట్లు తెలిసింది.ముఖ్యంగా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి కూడా ఇప్పటికే సమాచారం ఇవ్వడం ఇటీవల అమరావతికి రాహుల్‌ దూతగా ఆశోక్‌ గెహ్లట్‌్‌ కూటమి సమావేశంపై క్లారిటీ తీసుకొని వెళ్లారు మోదీపై ఉమ్మడిపోరుకు కూటమంతా ఏకతాటిపైకి తీసుకు రావడానికి బాబు విశ్వప్రయాత్నాలు చేస్తున్నారు.99ఎన్నికల నుంచి ఇప్పటివరకు చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలపైనే చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.గతంలో బాబు కన్వీనర్‌గా వ్యవహరించి నేషనల్‌ డెమాక్రాటిక్‌ అలయన్స్‌ విజయానికి కృషిచేయాగా వాజ్‌పా§్‌ు గద్దెనెక్కడం 99లో ఎన్డీయే గెలవడం తిరిగి వాజ్‌పా§్‌ు ప్రధాని కావడం 2004లో కూడా సంకీర్ణప్రభుత్వాన్ని వాజ్‌పా§్‌ు నడిపే తరహాలో అప్పట్లో కాంగ్రెస్‌ నాయకత్వం యునైటెడ్‌ ప్రొగ్రెసివ్‌ అలయన్స్‌ గద్దె నెక్కింది.అ సమయంలో 18పార్టీలు సంకీర్ణమైన 2014లో తిరిగి బిజేపియే గద్దెనెక్కింది.గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని బాబు చక్రం తిప్పి 1996లో యూడిఎఫ్‌ ప్రభుత్వంలో ప్రధాని దేవేగౌడను కూడా గద్దెనెక్కించడానికి బాబు కీలక పాత్ర పోషించారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒంటరిగా కేంద్రంపై ఢికొంటున్న కాంగ్రెస్‌పార్టీ బాబు ప్రతిపాదనతో రాహుల్‌కు ఎక్కడాలేని ఆనందంతో బాబుకు కూటమి నడిపే బాధ్యతలను తీసుకొవాలని కోరడం జరిగింది.ఈ తరుణంలో బాబు కూడా ఏకాభిప్రాయంతో కూటమిని ఏర్పాటుచేయాలని ప్రధాని నరేంద్రమోదీ బిజేపి అధినేత అమిత్‌షాలు కేవలం కేంద్రంపై ఎవరు హక్కులకోసం ఎదురుతిరిగినా వారిపై దాడులుచేసి వారు లొంగేవరకు కక్షసాధింపుగా చక్రం తిప్పుతున్నారు.

ఇంచుమించు వారిచ క్రాలకు అడ్డుకట్ట వేసేందుకు బాబు ఏకంగా సిబిఐనే రాష్ట్రంలోనికి ప్రవేశం లేకుండా అడ్డుకోవడం ఆయన బాటలోనే పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా అడుగు ముందుకేసింది.కేవలం బిజేపిన గద్దెదించాలంటే మూడవ కూటమే ప్రత్యామ్నాయ మార్గమని మోడీపై ఉమ్మడిపోరు కొనసాగించి మూకుమ్మ డిగా ఏకతాటిపైకి వచ్చేందుకు సోమవారం హస్తినలో బాబు విపక్షనేత లందరితో భేటీకావడం రాజకీయ ప్రాముఖ్యతను సంతరించుకొంది. ఈ నేపధ్యంలో కేంద్రంపై దేశవ్యాప్తంగా ఆందోళనను చేపట్టడానికి నిర్ణయం తీసుకోనున్నారు.

ఐదు రాష్ట్రాల ఫలితాల్లో మూడు రాష్ట్రాల్లో బిజేపేతర పార్టీలు అధికారం లోనికి వచ్చినా ఎన్డీయేపై విజయం సాధించినట్లుగా 2019 ఎన్నికలనుదృష్టిలో పెట్టుకొని బాబు జాతీయస్థాయిలో విపక్షాలను ఏకం చేయడానికి చక్రం తిప్పుతున్నారు.మూడవ కూటమి ఏర్పాటుకుదేశవ్యాప్తంగా 17పార్టీలు సంకీర్ణ కానునానయి. అయితే సోమవారం హస్తినాలో కూటమి బేటికి కొంతమంది జాతీయనాయకులకు కాంగ్రెస్‌పార్టీతో ఉన్న విభేదాలతో మరోమారు బేటీలో కలిసే అవకాశాలున్నాయి.బాబు ఈ బేటీలోనే అందరి నేతలను సమావేశానికి రావాలని అభ్యర్థించినట్లు తెలుస్తోంది.మొత్తంమీద మూడవ కూటమి బేఠీతో దేశస్థాయిలోని బిజేపి అగ్రనేతలు తలలు పట్టుకొని బాబుతో సఖ్యతగా మెలిగి విభజన హామీలను,ప్రత్యేకహోదాను కల్పించి నట్లుయితే ఈ పరిస్థితులు దాపురించేవి కావని బాహాటంగానే విమర్శించడం విశేషం.