కూటమికే ప్రచారం

shankar rao
shankar rao

కాంగ్రెస్‌ నేత శంకర్రావు
హైదరాబాద్‌: మహాకూటమిలోని కాంగ్రెస్‌తోపాటు, దాని భాగస్వామ్య పార్టీల తరపున పోటీ చేస్తున్న అభ్యర్థుల విజయానికి కృషి చేస్తానని మాజీ మంత్రి శంకర్రావు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోసం ఎదురు చూసిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రిగా పనిచేసిన శంకర్రావుకు అధిష్టానం టిక్కెట్‌ ఇవ్వ లేదు. షాద్‌నగర్‌ అసెంబ్లీ స్థానం టిక్కెట్‌ కోసం తీవ్ర ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోవడంతో ఆయన కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. అంతేకాకుండా షాద్‌నగర్‌ అసెంబ్లీ స్థానం నుండి ఇండిపెండెంట్‌గా ఆమినేషన్‌ సైతం దాఖలు చేశారు. ఆ తర్వాత సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. ఆ పార్టీ శంకర్రావ్‌కు బి ఫామ్‌ కూడా ఇచ్చింది. అయితే ఊహించని విధంగా తన నామినేషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. కాంగ్రెస్‌ పార్టీ, మహాకూటమి తరపున పోటీ చేసే అభ్యర్థుల గెలుపుకోసం కృషి చేస్తానని వెల్లడించారు.