కుశలము

బాల గేయం
                                      కుశలము

FARMER
FARMER

పచ్చదనం పసరుతనం
భూమాతకు జీవగుణం
ధరణి పైన ఆ హరితం
జీవ్ఞలకు ప్రాణ సమం
నీటికదే ఆధారం
బువ్వకదే ఆధారం
నీడకదే ఆధారం గాలికదే ఆధారం
చెట్లు, పొదలు, లతలుగాను
ఏ రూపంలో ఉన్నను
పల్లవించు హరిత దళం
అభయ హస్తమిచ్చు వరం
చూడగానె పచ్చదనం
మనసు దోచగలది నిజం
ప్రశాంతతను ప్రమోదమును
ప్రసాదించు దివ్య ధనం
పచ్చదనం ఉంటేనే
భూమాతకు చల్లదనం
చల్లదనం ఉంటేనే
మన మనుగడ కడు కుశలం
– బెలగాం భీమేశ్వరరావ్ఞ