కుల్గాంలో ఎన్‌కౌంటర్‌

dsp, kulgam encounter
dsp, kulgam encounter


ముగ్గురు మిలిటెంట్లు ఖతం
డిఎస్‌పిస్థాయి అధికారి మృతి, మరో ఆర్మీమేజర్‌కు గాయాలు
శ్రీనగర్‌: జమ్ముకాశ్మీర్‌లోని కుల్‌గామ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు మృతిచెందగా ఒక డిఎస్‌పి స్థాయి అధికారి చనిపోయారు. ప్రాథమిక నివేదికలను అనుసరించి జైషేముహ్మద్‌మిలిటెంట్లు ఈ ప్రాంతంలో తలదాచుకుంటున్నట్లు రక్షణదళాలకు సమాచారం రావడంతో గాలింపుచర్యలు ముమ్మరంచేసారు. పోలీస్‌ శాఖలో ఒక డిఎస్‌పి, ఒక మిలిటెంట్‌ ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. మరొక ఆర్మీమేజర్‌ తీవ్రంగా గాయపడినట్లు తేలింది. ఈ ఆపరేషన్‌కు ఇన్‌ఛార్జిగా వ్యవహరించిన డిఎస్‌పికి తీవ్రస్థాయి బుల్లెట్‌గాయాలయ్యాయి. ఎన్‌కౌంటర్‌ప్రాంతంలో ఒక మిలిటెంట్‌ మృతదేహాన్ని గుర్తించామన్నారు. ఇంకా కాల్పులు ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయన్నారు. ఆర్మీమేజర్‌ను 92 బేస్‌ ఆసుపత్రికి తరలించినట్లు సైన్యం ప్రకటించింది. ఆదివారంమధ్యాహ్నం దక్షిణకాశ్మీర్‌లోని కుల్‌గామ్‌ జిల్లాలో ప్రారంభం అయింది. ఆర్మీ సిఆర్‌పిఎఫ్‌, ఎస్‌ఒపి అధికారులు సంయుక్తంగా ఈ కాల్పులు ప్రారంభించారు. తూరిగామ్‌ప్రాంతంలోను, యారిపోరాప్రాంతాల్లో పోలీసులు చుట్టుముట్టి తనిఖీలు నిర్వహించారు. అక్కడ తలదాచుకుంటున్న మిలిటెంట్లు సైన్యం తారసపడగానే కాల్పులుప్రారంబించడంతో రక్షణదళాలు ఎదురుకాల్పులు ముమ్మరంచేసాయి. శ్రీనగర్‌కు 68 కిలోమీటర్లదూరంలో తూరిగామ్‌ప్రాంతం ఉంది. డిఎస్‌పి అమన్‌కుమార్‌ ఠాకూర్‌ ఈ ఎన్‌కౌంటర్‌లోచనిపోయారు. 2011 బ్యాచ్‌ అధికారి అయిన ఠాకూర్‌ జమ్ముకాశ్మీర్‌పోలీస్‌ సేవలకోసం కుల్‌గామ్‌లో పోస్టింగ్‌వచ్చింది. గడచిన రెండేళ్లుగా అక్కడే పనిచేస్తున్నారు. పుల్వామాలోని అవంతిపోరాలో జరిగిన ఆత్మాహుతి దాడి ప్రాంతానికి కేవలం 47 కిలోమీటర్ల దూరంలోనే కుల్గాం ఉంది. పదివేలమందికిపైగా అదనపు బలగాలను జమ్ముకాశ్మీర్‌కు తరలించింది. ఈప్రాంతంలోనే జైష్‌ ఉగ్రవాదులు ఎక్కువగా సంచరిస్తుండటం, స్థానికులసాయంతో దాడులకు పాల్పడుతుండటంతోరాష్ట్రపతి పాలనలో ఉన్న కాశ్మీర్‌ను ఉగ్రవాదంనుంచి విముక్తి కల్పించాలని మోడీ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.