కులవృత్తుల వారి కోసం నాయకులు ముందుకు రావాలి

KTR
KTR

హైదరాబాద్‌: తెలంగాణ భవన్‌లో బూర లక్ష్మయ రాజమ్మ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో గీత కార్మికులకు చెక్కుల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమానికి టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుత గీత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఎంపి బూర నర్సయ్యగౌడ్‌ ఎంతో కృషి చేశారని అన్నారు. ఈ ఫౌండేషన్ ద్వారా 60 వేల మందికి నేరుగా సహాయం అందుతుందన్నారు. ఈ సందర్భంగా బీఎల్ఆర్ ఫౌండేషన్ నిర్వాహకులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని కేటీఆర్ తెలిపారు. ఎంపీ బూర స్ఫూర్తితో నాయకులు ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. కులవృత్తులకు చేయూతనిచ్చే విధంగా నాయకులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.