కుమారుడికి వైద్యుల పేరు పెట్టిన జాన్సన్‌

 ప్రాణం పోసిన వైద్యులకు కృతజ్ఞతగా పేరు పెట్టిన జాన్సన్‌

కుమారుడికి వైద్యుల పేరు పెట్టిన జాన్సన్‌
boris johnson

లండన్‌: గత కొద్ది రోజుల క్రితం కరోనా మహామ్మారి బారిన పడి తీవ్ర అనారోగ్యానికి గురయిన బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ డాక్టర్ల కృషితో కోలుకున్నాడు. తనకు చికిత్స అందించిన డాక్టర్‌లకు కృతజ్ఞతగా తనకు ఈ మధ్యే జన్మించిన కొడుకుకు డాక్టర్‌ల పేరు వచ్చే విధంగా నామకరణం చేశారు. విల్‌ఫ్రెడ్‌ లారీ నికోలస్‌ జాన్సన్‌ అని తన పుత్రునికి పేరు పెట్టారు. ఇందులో విల్‌ఫ్రెడ్‌- బోరిస్‌ తాత పేరు వచ్చేలా, లారీ- సైమండ్స్‌ తాత పేరుకు చిహ్నంగా, ఇక నికోలస్‌- తనకు చికిత్స చేసిన డాక్టర్లు నిక్‌ ప్రైస్‌, నిక్‌ హర్ట్‌ లకు గుర్తుగా ఎంచుకున్నట్లు బోరిస్‌కు కాబోయే భార్య కేరీ సైమండ్స్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వెల్లడించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/