కుప్పకూలుతున్న రూపాయి

2000
New Currency

కుప్పకూలుతున్న రూపాయి

ముంబై,నవంబరు 21: పెద్దనోట్ల చెలామణి రద్దుపుణ్యమా అని ఒక్క సారిగా రూపాయిమారకం విలువలు కూడా దెబ్బతింటున్నాయి. మరో పక్క ట్రంప్‌ ఎన్నికతో అమెరికాలో వ్యయప్రణాళికలు పెరుగుతాయని, ఆర్ధిక వ్యవస్థ కోలుకుంటున్నందున డాలర్‌ పటిష్టం అవుతోందని, వడ్డీరేట్లు పెంచుతామని ఫెడ్‌ రిజర్వు ఛైర్‌పర్సన్‌ జన్నెట్‌ ఎల్లెన్‌ చేసిన వ్యాఖ్యలతో ప్రపంచవ్యాప్తంగా డాలర్‌ పటిష్టం అవుతోంది. భారత రూపాయి అయితే భారీస్థాయిలో పతనం అయినట్లే లెక్క. .డాలరుతో రూపాయి మారకం విలువలు 68.27 రూపాయలకు చేరాయి. రాను రాను రూ.70కు చేరే అవకాశం ఉందని నిపుణుల అంచనా. గడచిన వారం శుక్రవారం 68.13 రూపాయలుగా పలికిన డాలర్‌ వారం ప్రారంభంలోనే మరింతపటిష్టం అయింది.

సెన్సెక్స్‌ 350 పాయింట్లు పతనం అయి రూపాయిపై మరింత ఒత్తిడిపెంచింది. విదేశీ ఇన్వెస్టర్లు కూడా ఈ నెలలోనే ఇప్పటివరకూ రూ.9వేల కోట్లు స్టాక్‌ మార్కెట్ల నుంచి ఉపసంహరించుకున్నారు. అంటే అమ్మకాలు జోరందుకున్నట్లే లెక్క. ఇక భారీ నోట్ల రద్దు కూడా దేశీయ మార్కెట్‌ సెంటిమెంట్‌లను దెబ్బతీసిందనే చెప్పాలి. రానున్న రోజుల్లో కూడా రూపాయి పతనం కొనసాగుతుందని నిపుణుల అంచనా. హెచ్‌ఆర్‌బివి క్లయింట్‌ సొల్యూ షన్స్‌ వ్యవస్థాపకులు టిఎస్‌ హరిహర్‌ మాట్లాడుతూ డాలరుతో రూపాయి 68.85కు సైతం చేరుతుందని, 2013లో ఇదేస్థాయి కని పించిందని పేర్కొన్నారు. ఇక మరింత క్షీణించి డాలరుతో 70 రూపా యలకు చేరుతుందని, ఆయన అంచనా వేసారు. డొనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత డాలర్‌ పటిష్టం అయి 14ఏళ్ళ గరిష్టస్థాయికి చేరింది. ఆరుమేజర్‌ గ్లోబల్‌ కరెన్సీలతో పోలిస్తే డాలర్‌ పటిష్టంగాఉంది.

ట్రంప్‌విజయం కూడా ద్రవ్యోల్బణం పెరుగుతుంద ని, అమెరికా అధ్యక్ష ఎన్నికలో ట్రంప్‌ ఎన్నికవడంతో ఆయన ఇన్‌ఫ్రా రంగంపై పెట్టే వినిమయ ప్రణాళిక కూడా కీలకం అవుతుందని, దీని వల్ల పన్నులు తగ్గింపుపరంగా కూడా కొంత ప్రభావంచూపుతుందని నిపుణుల అంచనా. వీటన్నింటినీ కలగలిపితేబాండ్‌ రాబడులు భారీగా పెరిగాయి. డాలర్‌ పరంగా మరింత ఆకర్షణీయంగామారుతోంది. ఇన్వె స్టర్లు అమెరికా స్టాక్స్‌మార్కెట్లకు పరుగులు తీస్తున్నారు. అలాగే పెట్టు బడులను బాండ్లు వంటివాటిపై పెట్టుబడులు పెట్టేందుకు మరింత ఉత్సాహం చూపుతున్నారు.

అమెరికా ఆర్థిక గణాంకాలు పటిష్‌టం కావడంతో ఫెడ్‌రిజర్వు వచ్చేనెలలోనే వడ్డీరేట్లు పెంచుతుందని అంచ నావేసింది. వినియోగరంగంలో ఉత్పత్తులధరలు గతవారం లో భారీగాపెరిగాయి. హౌసింగ్‌ ఒనుగోళ్లు కూడాపెరిగినట్లు అంచనా. తొమ్మిదేళ్ళ గరిష్టస్థాయికి చేరాయి. ఫెడ్‌రిజర్వు ఛైర్‌పర్సన్‌ జన్నెట్‌ ఎల్లెన్‌ గతవారంలోనే వడ్డీరేట్లు పెంచు తుందని, డిసెంబరులోనే పెంచే అవకాశం ఉందన్న సంకేతా లిచ్చారు. దీనితో డాలర్‌ మరింతపటిష్టం అయి భారత్‌ రూపాయికి పతనం ప్రారంభం అయింది. అయితే ఎగుమతి ఆధారిత సంస్థలు ఐటి సంస్థలకు ఈ రాబడులు కలిసొచ్చా యి.

హెల్త్‌కేర్‌, ఫార్మా, ఐటి రంగ సంస్థలకు మంచి జోష్‌ ఉంటుందని అంచనా. భారత్‌నుంచి ఐటిరంగ సేవల ఎగు మతులు ఎక్కువగా అమెరికాకే జరుగుతున్నాయి. అలాగే పార్మారంగంలో అత్యధిక ఉత్పత్తులు అమెరికాలోనే అమ్ముడ వుతాయి. ఎఫ్‌డిఎ అనుమతించిన ఉత్పత్తుల్లో భారత్‌ వాటా యే ఎక్కువ. అలాగే భారతీయ ఫార్మారంగరాబడుల్లో అత్యధికశాతం అమెరికా వాటాయే ఉంటుంది. ప్రస్తుతం ఈ డాలర్‌ పటిష్టం కావడం కొన్ని సంస్థలకు కలసివస్తే మరికొన్ని కంపెనీలకు భారం అవుతోంది.