కునుకులేకుండా చేస్తున్న అణు కుంపట్లు

nuclear power plant
nuclear power plant

కునుకులేకుండా చేస్తున్న అణు కుంపట్లు

అణ్వాయుధాలను అన్ని దేశాలు విడనాడా లని ప్రపంచ దేశాధినేతలందరూ పదే పదే వల్లిస్తూనేఉంటారు. ఎక్కడ ఏ అవకాశం దొరికినా దీనిపై పెద్ద్దపెద్ద ఉపన్యాసాలు ఇస్తూనే ఉం టారు.అంతర్జాతీయ సమావేశాల్లో సుదీర్ఘంగా చర్చోప చర్చలు చేస్తున్నారు, తీర్మానాలు కూడా చేస్తున్నారు.కానీ ఆచరణకు వచ్చేవరకు ఇవేమీ పట్టించుకోవడం లేదు.ఎవరికి వారు ఇష్టానుసారంగా అణ్వాయుధాలను తయారు చేస్తు న్నారు. చివరకు ఐక్యరాజ్యసమితి వేదికగా అణ్వాయుధ రహిత ప్రపంచాన్ని ఆకాంక్షిస్తూ చేస్తున్న విజ్ఞప్తులను ఖా తరు చేయడం లేదు. ఫలితంగా అనేక దేశాలు అణ్వా యుధాలను కుప్పలు తెప్పలుగా సమకూర్చుకొంటున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కంటిమీద కునుకు లేకుండా చేస్తు న్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా ప్రపంచాన్నీ భస్మీప టలం చేయగల్గిన ఈ మారణాస్త్రాల గూర్చి సమగ్రమైన అవగాహన లేని దేశాధినేతలు కొందరు చేస్తున్న విన్యా సాలు ఒకరిపై ఒకరు చేసుకొంటున్న సవాళ్లు,బాధ్యతలేని మాటలు మరింత భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్‌ ట్రంప్‌ ఉత్తర కొరియా అధినేత కిమ్‌ను లక్ష్యంగాచేసుకొని చేస్తున్న హెచ్చ రికలు,ప్రకటనలు,అలాగే అంతకు ఏమాత్రం తగ్గకుండా కిమ్‌ చేస్తున్న ప్రతిసవాళ్లు ఉద్రక్తతను పెంచుతున్నాయి. తన ముందున్న టేబుల్‌ పై ఉన్న బటన్‌ నొక్కితే నిమిషా ల్లో అమెరికా భస్మం అయిపోతుందని అగ్రదేశాన్నే కిమ్‌ బెదిరించారు.అందుకు ట్రంప్‌ స్పందిస్తూ అంతకంటే పెద్ద బటనే తన టేబుల్‌ పై ఉందని కిమ్‌కు గుర్తుచేశారు.ఇద్దరూ కీలక పదవుల్లో ఉన్నా స్థిరత్వం లేని వ్యక్తులుగా గుర్తుంపు తెచ్చుకొన్నారు.ఏ సమయంలో ఏమాట్లాడుతారో? మళ్లీ ఎందుకు మాట మారుస్తారో?వారి ప్రవర్తన అంతా అంచ నాలకు అందదు.వారు చెప్పినట్లు వారి టేెబుళ్లపై ఆణ్వా యుధాలను ప్రయోగించే బటన్లు లేకపోయినా నిర్ణయాల్లో వారి పాత్ర ఎంతోకీలకమైనదే.ఈ ఇద్దరి నేతల మాటలతో ఒకదశలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకొన్నాయి. అయితే ఇటీవల తాజాగా కిమ్‌తో మాట్లాడానికి తనకు అభ్యం తరం లేదని ట్రంప్‌ ప్రకటించడంతో కొంతవరకు శాంతి ప్రియులు ఊపిరి పీల్చుకొన్నారు. అయితే మళ్లీ ఎప్పుడు పరిస్థితులు మారి మాటల యుద్దం మొదలై ఎటుదారి తీస్తుందోననే భయాందోళనలు లేక పోలేదు.పరిస్థితులు చేయిదాటి యుద్ధ్దమే సంభవిస్తే ఆ రెండు దేశాలకే పరిమి తం కాదు.ఆ అణ్వాయుధాలు మానవజాతినే సర్వనాశనం చేస్తాయి. ఒకసారి చరిత్రను పరిశీలిస్తే హిరోషిమా, నాగసా కి, చెర్నోబిల్‌, ఖజకిస్థాన్‌ లాంటి దేశాల్లో జరిగిన సంఘట నలు ఇప్పటికీ మరిచిపోలేం. ఇక ఈ అణ్వస్త్రాల పరీక్షలు మానవ జీవితాలనే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. అణ్వస్త్ర పరీ క్షలు నిర్వహించిన కేంద్రాల్లో వాయుకాలుష్యం అత్యంత దారుణంగా ఉన్నట్లువివిధ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

ఈ పేలుళ్ల ద్వారా వ్యాపిస్తున్న కాలుష్య గాలి అత్యంత వేగంగా వివిధ ప్రాంతాలకు విస్తరిస్తుంది. అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించిన పదకొండు కేంద్రాల్లో గాలివేగం గంటకు అరవైఐదు కిలోమీటర్లకు పైగా చేరుకుంటున్నట్లు దాన్నిబట్టి కాలుష్యరేణువ్ఞలు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు విస్త రిస్తున్నట్లు నిపుణులే హెచ్చరిస్తున్నారు. 1946 నుంచి 1956 మధ్యకాలంలో అరవైఏడు అతిపెద్ద అణ్వస్త్ర పరీక్షల కు మార్షల్‌ ఐర్లాండ్స్‌ కేంద్రస్థలి అయింది. సోవియెట్‌ యూనియన్‌ నిర్వహించిన ఎన్నో అణ్వస్త్రపరీక్షలకు ఖజకి స్థాన్‌ భారీమూల్యమే చెల్లించింది.అక్కడ ప్రజలఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపింది. చిన్నచిన్న దేశాలు అణ్వస్త్ర రహి త ప్రపంచాన్ని ఆకాంక్షిస్తుంటే పెద్ద దేశాలు మాత్రం అణు శక్తి సంపన్నంగా మారడానికి నిరంతరం ప్రయత్నాలు చే స్తూనే ఉన్నాయి.

రష్యాలో అత్యధికంగా ఏడువేల మూడు వందలకుపైగా అణ్వస్త్రాలు ఉండగా అందులో 1790 ఎప్పుడైనా ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నాయి. అమెరికా లో ఆరువేలతొమ్మిదివందల డెబ్భై అణ్వస్త్రాలు ఉండగా 1750 అణ్వస్త్రాలు ఏ క్షణాన్నయినా దాడులకు ఉపయో గించేందుకు సిద్ధం చేసిపెట్టారు.ప్రపంచవ్యాప్తంగా పరీక్షలు నిర్వహించిన దేశాల్లో అగ్రరాజ్యం అమెరికా మొదటిస్థానం లో ఉంది. దాదాపు వెయ్యికిపైగా అణ్వస్త్ర పరీక్షలు నిర్వ హించింది.ఇలా ఎవరికి వారు అణ్వస్త్రాలను సమకూర్చడం లో నిమగ్నమవ్ఞతున్నారు.

అయితే తాజాగా ఉత్తరకొరియా, దక్షిణకొరియామధ్యచర్చలకు తెరలేపడం శుభపరిణామంగా చెప్పొచ్చు. ఉభయ కొరియాల మధ్య దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ చర్చలు ప్రారంభమయ్యాయి. వచ్చే నెలలో దక్షిణ కొరియాలో జరిగే వింటర్‌ ఒలింపిక్స్‌కు తమ బృం దాన్ని పంపడానికి ఉత్తరకొరియా అంగీకరించింది. అలాగే దక్షిణ కొరియాతో మిలటరీ హాట్‌లైన్‌ సర్వీస్‌ను పునఃప్రా రంభించినట్లు ఇప్పటికే వెల్లడించారు. మొత్తం మీద ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య కొంతలో కొంతైనా శాంతి సుస్థి రతకు ఇది దోహదం పడుతుందనే సంకేతాలు వెలువడు తున్నాయి. మున్ముందు సైనిక విన్యాసాలు నిలిపివేసే దశ లో కూడా అడుగులు వేయవచ్చునని నిపుణులు అంగీక రిస్తున్నారు. ఆ రెండు దేశాలే కాదు అణ్వస్త్రాల తయారీ, పరీక్షల విషయంలో ప్రపంచంలోని అన్నిదేశాల నేతలు విజ్ఞతతో ఆలోచించాల్సిన అవసరం ఉంది.

కేవలం అణ్వ స్త్ర పరీక్షల వల్ల కొన్ని ప్రాంతాలకు ప్రాంతాలే దశాబ్ద్దాల పాటు వాటి రూపురేఖలే మారిపోయిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. ఇక యుద్ధమేగనుక వచ్చి దేశాలు ఒకదానిపై మరొకటి అణ్వస్త్రాలు ప్రయోగిస్తే ఎంతటి బీభత్సం జరుగుతుందో ఊహకే అందదు.ధరణీితలాన్ని భస్మీపటలం చేయగల దారుణాస్త్రాలు గూర్చి సమగ్రమైన అవగాహన, అధ్యయనం చేయని నేతల చేతిలో ఉండటం ప్రపంచానికి కంటి మీద కునుకులేకుండా చేస్తున్నది. అణ్వస్త్ర పరీక్షల్లో కూడా భారీనష్టమే జరుగుతున్నది. అణ్వస్త్రాల ప్రయోగా లకు, తయారీకి మంగళం పాడాల్సిన తరుణమిది.

– దామెర్ల సాయిబాబ, ఎడిటర్‌, హైదరాబాద్‌