కుటుంబ కథా చిత్రంగా రామ్‌(ఎన్‌.ఆర్‌.ఐ)!

RAMNRI
RAMNRI

కుటుంబ కథా చిత్రంగా రామ్‌(ఎన్‌.ఆర్‌.ఐ)!

అలి రెజా, సీతా నారాయణన్‌ హీరో హీరోయిన్లుగా మువ్వా క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఎన్‌.లక్ష్మి నంద దర్శకత్వంలో మువ్వ సత్యనారాయణ నిర్మాతగా రూపొందుతున్న చిత్రం రామ్‌(ఎన్‌.ఆర్‌.ఐ). పవర్‌ ఆఫ్‌ రిలేషన్‌ షిప్‌..అనేది క్యాప్షన్‌. ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుని రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ సినిమా టీజర్‌ విడుదల కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. విజ§్‌ు చందర్‌ మాట్లాడుతూ.. కొద్ది గ్యాప్‌ తర్వాత ఈ సినిమాలో మంచి పాత్ర చేశాను. డైరెక్టర్‌ లక్ష్మినంద పాత్రలన్నింటినీ చాలా చక్కటి ఎమోషన్స్‌తో చిత్రీకరించారు. కొత్త హీరో అలీ చక్కగా నటించాడు.కుటుంబ విలువలను తెలియజేసే చిత్రంగా అందరి మన్ననలను సినిమా పొందుతుంది అన్నారు. మాగంటి గోపీనాథ్‌ మాట్లాడుతూ.. మంచి కాన్సెప్ట్‌తో దర్శక నిర్మాతలు ఓ మంచి ప్రయత్నం చేశారు. ఇలాంటి మంచి మెసేజ్‌ ఉన్న చిత్రాలను ఆదరిస్తే ఇంకా మంచి చిత్రాలు వస్తాయి. తప్పకుండా ఈ సినిమా పెద్ద హిట్‌ కావాలి అన్నారు. నిర్మాత మువ్వ సత్యనారాయణ మాట్లాడుతూ.. నిర్మాతగా నాకు మొదటి చిత్రం. దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో నిర్మాతగా సినిమాను రూపొందించాలని అనుకున్నాను. కుటుంబ విలువలున్న ఈ సినిమాలో మంచి మెసేజ్‌తో పాటు కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ను కూడా జోడించి సినిమా చేశాం అన్నారు. దర్శకుడు లక్ష్మినంద మాట్లాడుతూ.. దర్శకుడిగా నా తొలి చిత్రం నాపై, నా కథపై నమ్మకంతో నిర్మాత నాకు దర్శకుడిగా అవకాశం ఇచ్చినందుకు నిర్మాత సత్యనారాయణగారికి థాంక్స్‌. సామాజిక స్పహ కలిగిన కుటుంబ కథా చిత్రమిది. అన్నీ వర్గాల వారిని అలరించి చిత్రంగా నిలుస్తుంది అన్నారు.