కుక్కల దాడిలో చిన్నారి మృతి

 

DOGF
కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం వేముపల్లిలో ఓ చిన్నారి కుక్కలదాడిలో మృతిచెందింది.ఈ విషాద సంఘటన గురువారం మధ్యాహ్నం జరిగింది. గ్రామంలోని అనన్య (2)పై కుక్కలు దాడిచేయగా చిన్నారి మృతిచెందింది. దీంతో గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.