కుంభమేళాకు 4200 కోట్లు

kumbhmela
kumbhmela

ప్రయాగ్‌రాజ్‌: త్రివేణి సంగమం నగరం అలహాబాద్‌ అలియాస్‌ ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా ఘనంగా మొదలైంది. ఐతే ఆ మహావేడుక కోసం యుపి ప్రభుత్వం 4200 కోట్లు కేటాయించింది. ఇది 2013లో జరిగిన మహాకుంభమేళా కన్నా మూడురెట్లు ఎక్కువ బడ్జెట్‌. ఈ ఏడాది జరుగుతున్న కుంభమేళాకు 4200 కోట్లు కేటాయించినట్లు ఆర్ధిక మంత్రి రాజేశ్‌ అగర్వాల్‌ తెలిపారు. సుమారు 48 రోజులపాటు సాగే పవిత్ర వేడుక కోసం ప్రజలు భారీ ఎత్తున వస్తున్నారు.