కుంభకోణం మొత్తం ఆబ్యాంకు చెల్లించాల్సిందే: ఆర్‌బిఐ

RBI
RBI

ముంబయి: పంజాబ్‌నేషనల్‌బ్యాంకుపరంగా వెలుగుచూసిన 11,359 కోట్ల రూపాయలకుంభకోణంలో మొత్తం ఇతర బ్యాంకులకు ఈ సొమ్మును చెల్లించాలని రిజర్వుబ్యాంకు పంజాబ్‌నేషనల్‌బ్యాంకునూదేశించింది. నిరవ్‌మోడీ నేతృత్వంలో చాకచక్యంగా జరిగిన ఈ దోపిడీపై పంజాబ్‌నేషనల్‌బ్యాంకు బాద్యత వహించాలతని వెల్లడించింది. ముంబై బ్రాంచ్‌లో తామే 11,359 కోట్ల విలువైన కుంభకోణం జరిగిందని మొదట గుర్తించామని వెల్లడించినా ఆర్‌బిఐపరంగా మాత్రం ఈబ్యాంకుదే చెల్లించాల్సి బాధ్యత ఉందని వెల్లడించింది. ఇతర కీలక బ్యాంకులన్నింటికీ బకాయిలు చెల్లించాల్సిన బాధ్యత పంజాబ్‌నేషనల్‌ బ్యాంకుదేనని బ్యాంకు చెల్లించనిపక్షంలో రానిబాకీల కేటాయింపులు రెట్టింపు చేసుకోవాల్సి ఉంటుందని, పంజాబ్‌నేషనల్‌బ్యాంకు, మరో 30 ఇతర బ్యాంకులు ఈబారీ నష్టంపై కేటాయింపులుపెంచిభరించుకోవాల్సి ఉంటుందని వెల్లడించారు. 30 బ్యాంకులకు రాసిన లేఖల్లో ఆర్‌బిఐ వాణిజ్యబ్యాంకులు మొత్తం నిబంధనలు ఉల్లంఘించాయని వెల్లడించింది. మంచిముత్యాలు దిగుమతికోసం ఏడాదిపాటు దేశంలోని బ్యాంకులు తమకు చెందిన విదేశీ బ్రాంచ్‌లకు లెటర్‌ ఆఫ్‌ అండర్‌స్టాండింగ్స్‌ జారీచేస్తాయి. ఆర్‌బిఐ ఇందుకు సంబంధించి 90రోజులు మాత్రమే గడువునిచ్చింది. ఎగుమతి అయినప్పటినుంచి 90రోజులవరకూ ఎల్‌ఒయును వినియోగించుకోవచ్చు. అయితే ఈనిబంధనను ఆయా బ్యాంకుల విదేశీశాఖలు ఉల్లంఘించినట్లు సమాచారం. పంజాబ్‌నేషనల్‌ బ్యాంకు చేస్తున్న ఆరోపణలను ఇతర బ్యాంకులు ఖండించాయి. రానిబాకీల సమస్య ఎక్కువగా ఉన్న పంజాబ్‌నేషనల్‌బ్యాంకు ప్రస్తుత కుంభకోణం మొత్తం చెల్లించేందుకు నిరాకరిస్తోందని వాదిస్తున్నాయి. ఎక్కడయినాసరే ఉద్యోగి అవినీతికి పాల్పడితే బ్యాంకు అంతకుముందు ఇచ్చిన పూచీకత్తుకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. అవినీతిజరిగిన మొత్తానికి ఆ బ్యాంకుదే ప్రధాన బాధ్యత ఉంటుందని ఆర్‌బిఐ వెల్లడించింది. ప్రస్తుతం పంజాబ్‌నేషనల్‌బ్యాంకు తన బాధ్యతనుంచి తప్పించుకోలేదని ఒక బ్యాంకరు స్పష్టంచేసారు. తాజాగా వెలుగుచూసిన కుంభకోణంబట్టిచూస్తుంటే బ్యాంకుల్లో ఆడిట్‌ వైఫల్యాలు స్పష్టం అవుతోంది. వాటిపై ఆర్‌బిఐ తనిఖీలు కూడా లేవన్నది స్పష్టం అవుతున్నట్లు ఒక సీనియర్‌ ఛార్టెడ్‌ అకౌంటెంట్‌ వెల్లడించారు. ఆర్‌బిఐ కూడా ఇలాంటి బ్యాంకులపై నిశిత పరిశీలన చేయాలని, అవసరమైతే ఫోరెన్సిక్‌ ఆడిట్‌నుసైతం నిర్వహించాలని అన్నారు. ఇప్పటివరకూ జరిగిన వాటిని చూస్తుంటే బ్యాంకుల్లో ఆడిట్‌లు కేవలం చట్టపరమైన ఆడిట్‌ మాత్రమే జరుగుతున్నదని, ప్రస్తుత ఆడిట్‌ అంతర్గత ఆడిట్‌ పూర్తి అయిన తర్వాత ఆర్‌బిఐ తనిఖీచేయాల్సి ఉంటుందని ఛార్టెడ్‌ అకౌంటెన్సి సంస్థ ప్రతినిధులు కొందరు చెపుతున్నారు. అంతర్గత ఆడిట్‌అంటే ఆర్‌బిఐ అధికారులు తనిఖీలు చేస్తారు. 2011నుంచి ఇప్పటివరకూ వెలుగులోనికి రాలేదంటే ఆడిట్‌ ఏవిధంగా జరుగుతున్నదో అవగతం అవుతున్నదని ఛార్టెడ్‌ అకౌంటెంట్లుచెపుతున్నారు. భారీ మొత్తంలో జరిగే లావాదేవీలు మొత్తం స్విఫ్ట్‌ వ్యవస్థలో తనిఖీలు అత్యంత జాగ్రత్తగా పరిశీలించాల్సినవిచేయలేదని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా మార్కెట్ల పర్యవేక్షణసంస్థ సెబీ బ్యాంకులు, ఇతర ఆర్ధిక సంస్థల్లో జరిగే లోపాలు, అవినీతి కార్యకలాపాలపై దృష్టిపెట్టాలని నిర్ణయించింది. అలాగే అనేక జ్యూయెలరీ సంస్థలు స్టాక్‌ మార్కెట్లలో జాబితా అయిన వాటిపై కూడా వాటి లావాదేవీలపై గురిపెట్టినట్లు స్పష్టం అవుతోంది. పంజాబ్‌నేషనల్‌ బ్యాంకులో వెలుగుచూసిన 11వేల కోట్ల అవినీతి భాగోతం నేపథ్యంలో సెబీ కూడా ఈ సంస్థల లావాదేవీలపై కన్నేసింది. జాబితా అయిన సంస్థలు ఇకపై వాటి బకాయిలను కూడా స్పష్టంచేయాలన్ననిబంధనను తెస్తోంది. అయితే బ్యాంకింగ్‌రంగం వ్యక్తంచేసిన నిరసనల నేపథ్యంలో ఈ నిబంధనను కొంతకాలంపాటు నిలిపివేసారు. ఇపుడు ఈ నిబంధన విధించాలని తెరపైకి తెస్తున్నారు. పంజాబ్‌నేషనల్‌ బ్యాంకుపరంగాచూస్తే తాము బ్యాంకులో 11,359 కోట్ల కుంభకోణం అంటే మోసపూరిత లావాదేవీలుజరిగినట్లు గుర్తించామని, ఈకేసును దర్యాప్తు సంస్థలకు అప్పగించినట్లు కూడా స్టాక్‌ఎక్చేంజిలకు వెల్లడించింది. ఇకపై సెబీ కూడా స్టాక్‌ ఎక్చేంజిల్లో జాబితా అయిన బ్యాంకులు, ఆర్ధికసంస్థలు, జ్యూయెలరీ సంస్థల లావాదేవీలు, అవకతవకలను పరిశీలించాలని నిర్ణయించినట్లు సమాచారం. పెద్దపెద్ద జ్యూయెలరీ సంస్థలు గీతాంజలి,గిన్ని, నక్షత్ర, నిరవ్‌మోడీ వంటి వారి లావాదేవీలను ప్రస్తుతం నిఘాపరిశీలనలో ఉంచారు. సిబిఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌లు వివిధ బ్యాంకులతో ఈసంస్థలు చేసుకున్న ఒప్పందాలపై కూడా కన్నేసి దర్యాప్తుచేస్తున్నాయి. ఇకపై సెబీ కూడా లిస్టింగ్‌ సంస్థల లావాదేవీలపై పూర్తిస్థాయి పరిశీలనచేస్తుందని సమాచారం.