కుంగుబాటుతో కోపతాపాలు!

ANGTRY-1
ANGTRY

కుంగుబాటుతో కోపతాపాలు!

రాకెట్‌లా పరుగులెత్తే పాశ్చాత్య దేశాలలోనే కాదు అన్ని నగరాలలోని జనస్రవంతిలో కూడా 60శాతం ఈ మానసిక ఒత్తిడికి లోనవ్ఞతూనిర్లిప్తత, డిప్రెషన్‌ లేదా తెలియని కోపతాపాలతో బాధపడుతున్నారని సర్వేలో తేలింది. మరో ముఖ్యవిషయం చాలాకాలం నుంచి ఏదో రకంగా మానసిక ఒత్తిడి, ఆలోచనలతో బాధపడుతుంటే అది మన మానసికవ్యవస్థ మీదే కాదు. శరీరం మీద కూడా ప్రభావం చూపిస్తుంది. అది కూడా సూటిగా ఏవేవో రోగాలని కలగజేస్తుంది. అంతేకాదు విపరీతమైన ప్రవర్తనాధోరణి కొన్ని వింత వింత ఆలోచనలు, పనులు కూడా చేయిస్తాయి. ప్రవర్తన, చేష్టలు ఒక్కొక్కప్పుడు ప్రమాదకారణమయినవి కూడా కావచ్చు. మీరు మానసిక ఒత్తిడి వలన వచ్చే వ్యాధులకి ఆలవాలమవ్ఞతున్నారని తోచిన వెంటనే జాగ్రత్తపడండి.

ఆ లక్షణాలు విపరీతం కాకముందే మంచి వైద్యుణ్ణి సంప్రదించడం అవసరం. ఈ ఒత్తిడి అంటే స్ట్రెస్‌ మన మనస్సును, ఆలోచనలను మాత్రమే కాదు శరీరాన్ని, ఆత్మని కూడా పాడుచేస్తుంది. మానవ శరీర నిర్మాణం భగవంతుని విచిత్ర విన్యాసం. మీరు అనుకోవచ్చు మానసిక ఒత్తిడికి శరీర రోగాలకి సంబంధం ఏమిటని, తీవ్రమయిన ఒత్తిడికి శరీరంలో నరాలు, మెదడు, గుండె ఉద్రిక్తమై క్రమంగా శరీరంలో కొన్ని వ్యాధులు సంభవిస్తాయి. ఎందువల్ల వస్తుంది ్య మీరు కోపంగా ఉన్నప్పుడు ముఖం ఎర్రబడుతుంది. కళ్లు పెద్దవవ్ఞతాయి. ఒక్కొక్కప్పుడు ఒళ్లు వణుకుతుంది. అలాగే తీవ్రంగా మీరు మానసిక ఒత్తిడికి లోనైనప్పుడు అది తగ్గించుకునే ప్రయత్నం చేసుకోకుండా ఉంటే ఆ ఒత్తిడి వ్యాధికి కారణమవ్ఞతుంది. ్య స్ట్రెస్‌ లేదా మానసిక ఒత్తిడిని మనం ఎలా నిర్వచిస్తాం? మనకి మనం సమాధానపరచుకోలేని స్థితిలో మనం అనుభవించే ఒక విచిత్రమయిన ఉద్రిక్త స్థితిని లేదా నిర్లిప్తస్థితిని స్ట్రెస్‌గా నిర్వచించవచ్చు.

్య వయస్సు వల్ల వచ్చే అనుభవం ఉన్నవాళ్లు, కఫప్రవృత్తి కలిగినవారు, సహనం ఎక్కువ ఉన్నవాళ్లు, పరిస్థితులకు తగ్గట్టుగా మలచుకోగలిగిన వనరులు ఉన్నవాళ్లు ఈ ఒత్తిడిని పెంచకుండా సమన్వయం చేయమంటారు. వాళ్లకి ఎంత ఒత్తిడి ఉన్నా ఎప్పుడో కాని కోపం రాదు. తట్టుకోలేని పరిస్థితులలో వస్తే మాత్రం అది తొందరగా తగ్గదు. అది నిరంతరం వెంటాడుతూనే ఉంటుంది. లక్షణాలు శరీరంలో లక్షణాలు కనిపించక పోయినా వీళ్లు బాధపెడుతుంటారు. మెడ లాగుతున్నట్లుండటం, తల బరువ్ఞగా ఉన్నట్లు అనిపించడం, తరచూ విరేచనం వస్తున్నట్లు అనిపించడం, తొందరగా కోపం రావడం, అరికాళ్లు, అరచేతులు వణకడం వంటి లక్షణాలు ఈ మానసిక ఒత్తిడి ఉండేవాళ్లు తరచూ చెపుతూండే బాధలు. మరి దీనికి పరిష్కారం? మందులు కాస్త ఉద్రిక్తతని తగ్గించవచ్చు లేదా నిద్రని తీసుకురావచ్చు. కాని మనోవ్యాధికి మందులేదంటారు. ఆ మందులు అలవాటు లేదా వ్యసనంగా మారే అవకాశం ఉంది. అందుకే మనకి మనం చికిత్స చేసుకోవాలి. పాజిటివ్‌ మెంటల్‌ అవ్ఞట్‌లుక్‌ ఆరోగ్యం గా ఉండటానికి, ఆహ్లాదంగా ఉండానికి తేడా ఉంది. ఆహ్లాదంగా ఉండి మీ చుట్టూ వాళ్లని ఉంచేందుకు ప్రయత్నించండి. మిమ్మల్ని కలవరపరుస్తున్న సమస్యల నుండి మనస్సును మరల్చుకోండి.