కీలక బిల్లులు ఆమోదం

GST
GST

కీలక బిల్లులు ఆమోదం

జిఎస్‌టి అమలుకు సమగ్రరూపం
తొమ్మిది నిబంధనలకు జిఎస్‌టి మండలి గ్రీన్‌సిగ్నల్‌

న్యూఢిల్లీ, మే 19: జిఎస్‌టి మండలి కీలకమైన తుదివిడత సమావేశం లో జిఎస్‌టి అమలుకు అవసరమైన తొమ్మిది నిబంధనలనూ ఆమో దించింది. వాటిలోమార్పులు, విలువలు, కూర్పు, ఇన్‌పుట్‌ట్యాక్స్‌ క్రెడిట్‌, ఇన్వాయిస్‌, చెల్లింపులు, రీఫండ్‌, రిజిస్ట్రేషన్‌ వంటి వాటితో పాటు రిటర్నులవ్యహారాలు కూడా అన్నింటినీ ఆమోదించింది. జమ్ము కాశ్మీర్‌ రాష్ట్రంలోని శ్రీనగర్‌లో జరిగిన కీలక సమావేశంలో జిఎస్‌టి మండలి ఈ తొమ్మిది నిబంధనలను ఆమోదించింది.

జిఎస్‌టి రేట్లను స్థిరీకరించే ముందు మినహాయింపులపై మరోవిడత చర్చించనున్నది. జిఎస్‌టి మండలిసభ్యుల అంచనాల ప్రకారంచూస్తే గురువారం నాటి సమావేశంలో మినహాయింపు కేటగిరీలోని ఉత్పత్తులపై చర్చలు జరు గుతాయని అన్నారు. ఈ కేటగిరీలో సుమారు100కుపైగా ఉత్పత్తులు ఉంటాయని అంచనా. ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ అధ్యక్షతన జరిగిన రెండురోజుల సమావేశంలో జిఎస్‌టి నిబందనలు, రేట్ల స్థిరీకరణ అం శాలే కీలకంగా ఉన్నాయి 50రోజులకు అమలుకు వస్తున్న వస్తుసేవల పన్నుపరంగా సుదీర్ఘ కసరత్తులు సమగ్ర రూపం ఇస్తున్నట్లు చెపుతు న్నారు.

జిఎస్‌టి జూలై ఒకటి నుంచి అమలవుతుందా లేదాన్నది ఈ సమావేశంలోనే తేలిపోతుంది. శ్రీనగర్‌లోని షేరి ఇ కాశ్మీర్‌ అంతర్జాతీ య కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగింది. మొత్తం 3వేలమందికిపైగా సిబ్బం ది రాష్ట్ర పోలీస్‌, బిఎస్‌ఎఫ్‌, సిఆర్‌పిఎఫ్‌ వంటి వారు బందోబస్తు నిర్వహించారు. జమ్ముకాశ్మీర్‌ ఆర్థికమంత్రి హసీబ్‌ ద్రాబు మాట్లా డుతూ తమ బిల్లు జిఎస్‌టిని సెంబ్లీలో వచ్చే 30రోజుల్లో ప్రవేశపెడు తుందని అన్నారు. రియల్‌ఎస్టేట్‌ కూడా జిఎస్‌టిపరిధిలోకి రావా ల్సిందేనన్నారు.

గురువారం నాటి సమావేశం అత్యంత కీలకమనదని అన్నారు. ఢిల్లీ ఆర్థికమంత్రి మనీష్‌ సిసోడియా మాట్లాడుతూ సరఫరా పంపిణీలకు సంబంధించి గమ్యస్థానం ఎక్కడ అనేది కడమావేశంలో చర్చించామన్నారు. ఆప్‌పరంగా కొన్ని అంశాలను లేవనెత్తామన్నారు. పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి.నారాయణస్వామి అంచనాల ప్రకారం చూస్తే సామాన్యమానవునికి భారం కాకూడదన్న లక్ష్యంతో ఉన్నట్లువివరించారు. న్యాయబద్ధంగా ముందుకు వెళతామన్నారు. వివిధ శ్లాబ్‌లపరంగా వివిధ ఉత్పత్తులకు శ్లాబ్‌రేట్లను కూడా జిఎస్‌టి మండలి స్థిరీకరిస్తుంది. జిఎస్‌ఇ పన్నురేట్‌, ఫిట్‌మెంట్‌ కమిటీ సిఫారసులను చర్చించి ఆమోదిస్తుందని తేలింది. జిఎస్‌టికి నాలుగు శ్లాబ్‌లున్నాయి.

ఐదుశాతం, 12శాతం, 18శాతం, 28శాతంగా నిర్ణయించారు. అలాగే జీరో రేటేడ్‌ ఉత్పత్తులు కూడా ఉన్నాయి. మరికొన్ని మినహాయిం పులున్న ఉత్పత్తులున్నాయని జిఎస్‌టి కమిటీ వెల్లడించింది. అలాగే కొన్ని ఉత్పత్తులపై అంటే పొగాకు ఉత్పత్తులు, సిగరెట్లు, విలాసవం తమైన కార్లు, మత్తుపానీయాలపై అదనపు సెస్‌ విధించే అవకాశం కూడా ఉంది. సుదీర్ఘకాలంగా నలుగుతూ వస్తున్న జిఎస్‌బిల్లుకు ఎట్ట కేలకు మోక్షం కలుగుతోంది.

అన్నిరాష్ట్రాల ఆర్థికమంత్రులు సభ్యులు గా ఉన్న జిఎస్‌టి మండలికి ఉన్న విశేషాధికారలతో సుదీర్ఘకసరత్తులు జరుగుతున్నాయి. పార్లమెంటు ఆమోదించిన తర్వాత బిల్లుకు తుది రూపం ఇచ్చారు. ఇప్పటివరకూ రాజ్యాంగసవరణకే ఆమోదం జరిగిన తర్వాత జిఎస్‌టి బిల్లుకు పార్లమెటు ఆమోదిస్తుంది. తదనంతరంవెను వెంటనే చట్టాలు అమలులోకి వస్తాయి. ఈలోపు సగానికిపైగా రాష్ట్రా ల అసెంబ్లీలు జిఎస్‌టి ఇల్లుకు ఆమోదం తెలియజేయాల్సి ఉంటుంది. ఇప్పటికే దేశంలోని అత్యధికరాష్ట్రాలు జిఎస్‌టి బిల్లును ఆమోదించాయి.