కీలక పథకాలే

TS BUDGET
TS BUDGET

This slideshow requires JavaScript.

కీలక పథకాలే

వడ్డీ, వాయిదాల చెల్లింపులకు రూ.11,791.11 కోట్లు
రాష్ట్ర రుణం రూ. 2,21,777 కోట్ల 93 లక్షలు,
తలసరి అప్పు రూ.63,358
పెట్టుబడి వ్యయంలో వృద్ధి శాతంలో క్షీణత
నీటిపారుదల రంగంలో 37 శాతమే ఖర్చు
నీటిపారుదలకు ఈ ఏడాది కూడా రూ.25వేల కోట్లు

హైదరాబాద్‌: తెలంగాణలో కోటి ఎకరాలకు నీరు అందించడం లక్ష్యంగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టేందుకు ఈఏడాది కూడా నీట ిపారుదల రంగానికి రాష్ట్రప్రభుత్వం రూ.25, 000 కోట్లు ప్రతిపాదించింది. ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో నీటిపారుదలకు కేటాయించే నిధుల ప్రతిపాద నలను వివరించారు.

గోదావరి,కృష్ణ నదులపై 23 మేజర్‌,13 మీడియం ఇరిగేషన్‌ ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టిందని, దశాబ్దాల తరబడి పెండింగ్‌లో ఉన్న పాలమూరు ప్రాజెక్టు లను శరవేగంగా పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే పాతపాలమూరు జిల్లాలో ఆరున్నర లక్షల ఎకరాలకు సాగునీరుఅందించాం. ఈ ఏడాది వర్షాకాలం పంటనాటికి 8 లక్షల ఎకరా లకు సాగునీరు అందిస్తాం. వలసల జిల్లాగా పేరుపడిన పాలమూరు జిల్లాకు, ఫ్లోరైడ్‌ బాధిత పాత నల్లగొండ జిల్లాకు,తీవ్ర దుర్భిక్షం ఎదుర్కొంటున్న పాత రంగారెడ్డి జిల్లాల్లోని బీడు భూములకు సాగునీరు అందించేందుకు శాశ్వత పరిష్కారంగా పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపో తల పథకాన్ని శరవేగంగా నిర్మిస్తున్నాం. ప్రాజె క్టుల నిర్మాణం కోసం ప్రభుత్వం పట్టుదలతో చేస్తున్న కృషిపై ప్రజల్లో విశ్వాసం పెరిగింద న్నారు. పొట్ట చేతపట్టుకొని వలసపోయిన కూలీ లెందరో తిరిగి తమ సొంత ఊళ్లకు వస్తున్నారు. రికార్డు సమయంలో భక్త రామదాసు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేశామని, కరువు పీడిత ప్రాంత మైన పాలేరు నియోజకవర్గం దీనితో సస్య శ్యామలమైందని, ఖమ్మం జిల్లాను సస్యశ్యా మలం చేసేందుకు గోదావర నదిపై తలపెట్టిన సీతారామ ఎత్తిపోతల పథకం నిర్మాణం పురో గతిలో ఉందన్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, మెదక్‌, వరంగల్‌తో పాటు నల్లగొండ జిల్లాకు వరప్రదాయినిగా భావిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొద్ది నెలల వ్యవధిలోనే వాటర్‌ పంపింగ్‌ పాక్షికంగా ప్రారం భించబోతున్నామన్నారు. మరో రెండేళ్లలో రిజర్వాయర్లు, కాల్వలతో సహా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తా మన్నారు.ఈప్రాజెక్టు కింద దాదాపు 36.75 లక్షల ఎకరాలకు నీరు అందించడానికి యుద్ద ప్రాతి పదికన పనులు జరుగుతు న్నాయి.రాష్ట్ర ప్రభుత్వ నిరంతర కృషి వల్ల కాళేశ్వరం ప్రాజ ెక్టుకు సంబంధించిన అన్ని అనుమతులను సకా లంలో తెచ్చుకోగలిగామన్నారు. మిషన్‌ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్దరణ కొనసాగుతున్నది. మొదటి మూడు దశల్లో అధిక శాతం నీటి నిల్వ సామర్థ్యం కలిగిన ప్రధానమైన చెరువుల పునరు ద్దరణ పూర్తయింది.
మిగతా చిన్న చెరువులు, కుంటల పనులు పురోగతిలో ఉన్నాయన్నారు.