కీలకం కానున్న ధర్మశాల పిచ్‌

stadium
stadium

కీలకం కానున్న ధర్మశాల పిచ్‌

ధర్మశాల: ప్రస్తుతం ఎక్కడ చూసినా చర్చ పిచ్‌ గురించే సాగుతుంది. పుణే, బెంగళూరు, రాంచీ లలో ఎక్కడ మ్యాచ్‌ జరిగినా చర్చ మాత్రం పిచ్‌ పైనే.ఈ మూడు మైదానాల్లో ముందుగా ఊహించినట్లు ఎక్కడా జరుగలేదు.ఇక ఇప్పుడు అందరి దృష్టి బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో టీమిండియా,ఆస్ట్రేలియా మధ్య జరుగనున్న నాలుగవ టెస్టు వైపు మళ్లింది.

రెండు జట్లు 1-1 తో సమవుజ్జీలుగా ఉండటంతో పిచ్‌ కీలకం కానుంది.ఈ నేపథ్యంలో బౌన్సీ వికెట్‌ రూపొం దించినట్లు ధర్మశాల క్యూరేటర్‌ సునీల్‌ చౌహాన్‌ పేర్కొన్నారు.ఈ రోజు వరకు నాకు ఎవరి నుంచి సూచనలు అందలేదు.ట్రాక్‌ సహజ స్వభావాన్ని దృష్టిలో ఉంచుకుని పిచ్‌ రూపొందించాను.ఇది బౌన్స్‌ వికెట్‌.కట్‌, పుల్‌ షాట్లు ఆడేవారికి అనుకూలంగా ఉంటుంది. రోహిత్‌శర్మ ఇక్కడే టి20ల్లో సెంచరీ సాధిం చాడు అని చౌహాన్‌ పేర్కొన్నాడు. ధర్మశాలలో ఎప్పుడూ ఫలితం వచ్చేలా పిచ్‌ తయారు చేసేందుకు ప్రయత్నిస్తా మన్నాడు. ఈ రంజీ సీజన్‌ల అశోక్‌ దిండా, ఈశ్వర్‌ పాండే చాలా వికెట్లు పడగొట్టారని పేర్కొన్నాడు.పిచ్‌ నిర్వహణ కోసం లూథియానా నుంచి ప్రత్యేకమైన మట్టిని తీసుకొస్తామని చౌహాన్‌ వివరించాడు.