కీర్తి 20లో ప్రముఖులు

keerthy suresh
keerthy suresh

మలయాళ బ్యూటీ కీర్తి సురేష్‌., ప్రస్తుతం తెలుగులో ఓ లేడీ ఒరియెంటెడ్‌ మూవీలో నటిస్తోంది.. ఇటీవలే ఈచిత్రం తొలిషెడ్యూల్‌ స్టార్ట్‌ అయ్యింది.. నరేంద్ర డైరెక్టు చేస్తున్న ఈచిత్రంలో రాజేంద్ర ప్రసాద్‌, నరేష్‌, కమల్‌ కామరాజ్‌, నదియా, భానుశ్రీ మెహతా ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.. ఇక ఈషెడ్యూల్‌ తర్వాత చిత్రం యూనిట్‌ యుఎస్‌ వెళ్లనుంది.. దాదాపుగా 40 రోజులపాటు అక్కడ షూటింగ్‌ జరపనున్నారు.. ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్‌ పతాకంపై మహేష్‌ ఎస్‌ కోనేరు నిర్మిస్తున్న చిత్రం తెలుగుతోపాటు తమిళంలో కూడ విడుదల కానుంది.