కిసాన్ క్రాంతి యాత్రను అడ్డుకున్న పోలీసులు

న్యూఢిల్లీ: రైతుల రుణమాఫీ, మద్దతు ధర, విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కోరుతూ రైతుల మహాపాదయాత్ర కొనసాగుతుంది. సెప్టెంబరు 23న హరిద్వార్ నుంచి ప్రారంభమైన కిసాన్ క్రాంతి పాదయాత్ర ఢిల్లీకి చేరుకుంది. నేడు ఢిల్లీలోని కిసాన్ ఘాట్‌కు చేరడంతో కిసాన్ క్రాంతి యాత్ర ముగియనుండగా ఉత్తరప్రదేశ్-ఢిల్లీ సరిహద్దులో కిసాన్ క్రాంతి యాత్రను పోలీసులు అడ్డుకున్నారు. భారతీయ కిసాన్ యూనియన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో రైతులు పాదయాత్రలో పాల్గొన్నారు. వాటర్ కెనాన్లు ప్రయోగించి కిసాన్ ఘాట్‌కు వెళ్తున్న రైతులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఆ మార్గంలో ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకెళ్లేందుకు ప్రయత్నించారు.