కిమ్‌, నేను ప్రేమ‌లో ప‌డ్డాం

KIM, TRUMP
KIM, TRUMP

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌, తాను ప్రేమలో పడ్డామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చెప్పారు. ఇటీవల కిమ్‌ రాసిన ఓ అందమైన లేఖ తనకు అందిందని తెలిపారు. పశ్చిమ వర్జీనియాలో రిపబ్లికన్‌ పార్టీ స్థానిక అభ్యర్థులకు మద్దతుగా జరిగిన ర్యాలీలో ట్రంప్‌ మాట్లాడుతూ కిమ్‌, నేను ప్రేమలో పడ్డాం. ఆయన నాకు అందమైన లేఖ రాశారు. నేను కూడా బదులిస్తూ లేఖ రాశాను అని చెప్పారు. గత వారం ఐరాస సర్వసభ సమావేశంలోనూ కిమ్‌ను ట్రంప్‌ పొగడ్తలతో ముంచెత్తారు.