కిదాంబి శ్రీకాంత్‌కు డిప్యూటీ కలెక్టర్‌ హోదా!

kidambi srikanth
kidambi srikanth

అమరావతి: భారత షట్లర్‌, తెలుగుతేజం కిదాంబి శ్రీకాంత్‌కు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్‌ హోదా కల్పించింది. ఇందుకు సంబంధించిన
బిల్లుకు శనివారం శాసనసభ ఆమోదం తెలిపింది. గుంటూరుకు చెందిన కిదాంబి శ్రీకాంత్‌ ఈ ఏడాది నాలుగు సూపర్‌ సిరీస్‌ టైటిల్స్‌ను కైవసం
చేసుకున్నారు. జూన్‌లో ఇండోనేషియా ఓపెన్‌తో పాటు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ నెగ్గిన శ్రీకాంత్‌ ఆక్టోబర్‌లో డెన్నార్క్‌ ఓపెన్‌, ఆ తర్వాత ఫ్రెంచ్‌ ఓపెన్‌
సూపర్‌ సిరిస్‌లు నెగ్గి ఒకే ఏడాది నాలుగు సూపర్‌ సిరీస్‌ టైటిళ్లు గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. ఇలా శ్రీకాంత్‌ అసాధరణ
ప్రతిభ గుర్తించిన ఏపీ ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్‌ హోదాతో గౌరవించింది.