కిడ్నీ సంబంధిత వ్యాధితో నవాజ్‌

NAWAZ SHAREEF
NAWAZ SHAREEF

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ మూత్రపిండ వ్యాధితో బాధపడుతున్నారని ఆయనను వెంటనే ఆడిలాల్‌ జైలు నుండి ఆస్పత్రికి తరలించాలని జైలు అధికారుల్ని మెడికల్‌ బోర్డు కోరింది. ఈ నెల 6న నవాజ్‌షరీఫ్‌కు ఆయన కుమార్తె మర్యమ్‌కు అదనపు కోర్టు జైలు శిక్ష విధించిన విషయం విదితం.ఈ సందర్భంగా షరీఫ్‌ను ఆడిలాల్‌ జైలుకు తరలించారు.జైలులో ఉన్న ఆస్పత్రిలో ఉన్న ఆయనకు ప్లూయిడ్‌ను మాత్రమే ఇస్తారని, దీంతో ఆయన మూత్రపిండాలకు ప్రమాదం కలిగే అవకాశముందని వైద్యపరీక్షలు నిర్వహించిన మెడికల్‌ బోర్డు అధికారులు తెలిపారు. ఆయన రక్తంలో నైట్రోజన్‌ స్థాయి పెరిగిందని, హార్ట్‌ బీట్‌ పెరిగిందని, డీహైడ్రేషన్‌తో బాధపుడుతున్నారని వివరించారు. రాత్రి వేళలలో అత్యవసర పరిస్థితలు ఏర్పడవచ్చని, పాకిస్థాన్‌లో తాత్కాలిక ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని అధికారులు తెలిపారు.