కిడారి హత్యకేసుకు సంబంధించిన ఇద్దరి అరెస్ట్‌

KIDARI SARVESWARARAO
KIDARI SARVESWARARAO

అమరావతి: టిడిపికి చెందిన అరకు ఎమ్మెల్యె కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యె సివేరి సోమా హత్య కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్ట్‌ చేసినట్లు సమాచారం. వీరిద్దరి హత్యకేసును రాష్ట్రప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని విచారణ జరుపుతుంది. హత్యతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులను ఎన్‌ఐఏ అధికారులు ఈనెల 6వతేదిన అరెస్టు చేశారు. అలాగే ఈ కేసులో ఇంకా దర్యాప్తు జరుగుతుండగా మరికొంతమంది నిందితులను కూడా త్వరలో అరెస్ట్ చేసే అవకాశమున్నట్లు సమాచారం.