కిక్కిరిసిన ఓటర్ల నమోదు కేంద్రాలు

Voters List
Voters List

హైదరాబాద్‌ :ఓటర్ల జాబితాలో పేర్ల తప్పులను సరిచేసుకునేందుకు, బోగస్‌ ఓట్లను ఏరివేసేందుకు, అడ్రసు లను మార్చుకునేందుకు,డబుల్‌ ఓట్లను తొలగించేందుకు ఈనెల 25 ఆఖరు గడువు కావడంతో ఓటర్ల నమోదు కేంద్రాలు తెలంగాణ వ్యాప్తంగా మంగళవారంనాడు జనంతో కిక్కిరిసి పోయాయి. ఎన్నికల అధికారులు, జిల్లా, కమిషనరేట్‌, మండల,మున్సిపల్‌ స్థాయి అధికారులు ఓటర్ల నమోదుకు ప్రక్రియకు సహకరించారు. అయితే ఓటర్ల జాబితాలో సవరణలకు ఈనెల 25వ తేదీ అఖరు గడువు కావడంతో పేర్లు నమోదు అయినవారు, అడ్రసులు మారిన వారు. జాబితాలో పేర్లు గల్లంతైనవారు మార్పులు,చేర్పులు చేసుకునేందుకు ఓటర్ల నమోదు కేంద్రాల్లో బిజీగా గడిపారు. అయితే కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమం నిరంతర ప్రక్రియ అని,ఎన్నికల పోలింగ్‌కు 10 రోజుల ముందు వరకు కూడా ఫామ్‌ 6 ద్వారా ఓటరు నమోదు చేసుకోవచ్చునని,దరఖాస్తుకు సంబంధించి రిసీట్‌ ప్రింట్‌ తీసుకుని పోలింగ్‌లో పాల్గొనవచ్చునని అధికారులు చెబుతున్నారు.