కిందపడ్డ ఫోటోగ్రాఫర్‌ను కాపాడిన రాహుల్‌

Photographer falls. Rahul Gandhi hurries to
Photographer falls. Rahul Gandhi hurries to

భువనేశ్వర్‌: కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం ఈరోజు ఒడిశా చేరుకున్నారు. భువనేశ్వర్‌ విమానాశ్రయం వద్ద ఆయన నడిచి వెళుతుండగా అక్కడికి స్థానిక ఫొటోగ్రాఫర్‌ ఆయన ఫొటోలు తీసేందుకు యత్నించారు. ఆ సమయంలో ఫొటోగ్రాఫర్‌ అదుపుతప్పి గట్టుమీద నుంచి కాలు జారి పడిపోయారు. దీనిని గమనించిన రాహుల్‌ వెంటనే ఫొటోగ్రాఫర్‌ వద్దకు వెళ్లి చేయి అందించి పైకి లేపారు. ఫొటోగ్రాఫర్‌ నడుము, తల భాగానికి స్వల్పంగా గాయాలయ్యాయి.