కించపరిచే ఈ తిట్లు ఇంకానా!

CHELI1
CHELI

కించపరిచే ఈ తిట్లు ఇంకానా!

స్త్రీ సంబంధమైన మాటలతో ఉన్న బూతులు స్త్రీలను తిట్టడానికి, పురుషుల్ని తిట్టడానికి రెండు రకాలుగా వాడతారు. స్త్రీలను ఉద్దేశించి వాడేటప్పుడు వారిని కించపరిచే ఉద్దేశం స్పష్టంగా ఉంటుంది. పురుషుల్ని ఉద్దేశించి వాడేటప్పుడు స్త్రీలను కించపరచాలన్న ఉద్దేశం ఉండదు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే స్త్రీలను కించపరుస్తున్నా మన స్పృహ ఉండదు. స్వకుచమర్దనం మొదలైనవి భాషలో జాతీయాలుగా కూడా స్థిరపడ్డాయి.

స్త్రీవాదం, స్రీవాద సాహిత్యం వచ్చిన తర్వాత, ఇలాంటి విషయాలపైన లోతైన చర్చలు జరిగిన నేపధ్యంలో, స్త్రీలను కించపరిచే మాటలను తిట్లుగా ఏ సందర్భంలోనూ వాడకూడదన్న చైతన్యం కలిగింది. చివరకు బలమైన భావ ప్రకటన కోసం కూడా అలాంటి మాటలను వాడడం పురుషాధిక్య వ్యవస్థ తాలూకు అవలక్షణాలేనని అర్థం చేసుకోగలిగాం. చెరబండరాజు సాహిత్యంలో చాలాచోట్ల ‘ఆడది అనే మాట కనిపిస్తుంది. పాత్రల ద్వారానేగాక, రచయిత కూడా స్వయంగా ఆ మాట ప్రయోగిస్తాడు. ‘స్త్రీ అనిగాక, ‘ఆడది అని ప్రయోగించడం తెలిసో, తెలియకో కించపరచినట్లుగానే అనిపిస్తుంది. ఇక పోలీసుల చేత, భూస్వాముల చేత ఒసె§్‌ు, ముండ వంటి మాటల్ని అనిపించాడు. 1975వ సంవత్సరాన్ని అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా ప్రకటించారు.

అయినా స్త్రీపురుష సంబంధాలపైన అప్పటికి లోతైన చర్చ జరగలేదు. చెరబండరాజు నవలా సాహిత్యంలోంచి ప్రధానంగా నాలుగు స్త్రీ పాత్రల్ని ఎంచుకుని, స్త్రీ పురుష సంబంధాలను ప్రధానంగా నాలుగు స్త్రీపాత్రల్ని ఎంచుకుని, స్త్రీ పురుష సంబంధాలను అధ్యయనం చేయవచ్చు. ఆ పాత్రలివి: రమ (మాపల్లె), కమల (ప్రస్థానం), హైమ, ఝూన్సీ (దారిపొడుగునా). రమ పదహారేళ్ల వయసులో ఉన్న కాలేజీ అమ్మాయి. విద్యార్థి ఉద్యమం విప్లవోద్యమం, విప్లవ సాహిత్యోద్యమం ప్రభావాలున్నాయి. కరపత్రాలు పంచడం, ఊరేగింపులో పాల్గొనడం, పుట్టినరోజును జరుపుకోవడాన్ని నిరసించడం, అవసరమైతే తండ్రినైనా ఎరించగలగడం అప్పటికి రమ చైతన్యానికి నిదర్శనాలు. చిన్న వయసులోనే పెద్ద అనుభవాలు, కష్టాలు ఎదురవ్ఞతాయి రమకు. బతకలేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుంది. ఆత్మహత్య పిరికితనానికి చిహ్నంగా భావిస్తుంది. ఎలాగైనా సరే బతకడమే మంచిదనుకుంటుంది. ్పు తకడమే మంచిదనుకుంటుంది.