కింగ్స్ ఎలెవ‌న్ పంజాబ్ జ‌ట్టుకి కెప్టెన్‌గా అశ్విన్‌

 

Ravichandran ashwin
Ravichandran ashwin

ఐపీఎల్ 11వ సీజన్ కోసం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కెప్టెన్‌గా అశ్విన్‌ని నియమిస్తున్నట్లు జట్టు యాజమాన్యం ప్రకటించింది. గత కొద్ది రోజులుగా ఫాంలో లేనందున టీం ఇండియాకి దూరంగా ఉంటున్న రవిచంద్రన్ అశ్విన్‌ను ఈ పదవి వరించింది. ఈ ఏప్రిల్ 7 నుంచి ప్రారంభంకానున్న గత సీజన్‌లలో చెన్నై సూపర్ కింగ్స్, పుణె సూపర్ జెయింట్స్ జట్టు తరఫున ఆడిన అశ్విన్ ఈ ఏడాది జరిగిన వేలంలో చెన్నై జట్టు అశ్విన్‌ను తమ జట్టులోకి తీసుకోవడంలో ఆసక్తి చూపలేదు. దీంతో పంజాబ్ జట్టు అశ్విన్‌ను రూ.7.6 కోట్లు పెట్టి కొనేసింది. అంతేకాక జట్టు మెంటర్ వీరేంద్ర సెహ్వాగ్ సలహా మేరకు అతనికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు జట్టు తమ ఫేస్‌బుక్ పేజీ ద్వారా ప్రకటించింది.