కాసేపట్లో కూటమి సమావేశం

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ మహాకూటమి నేడు మరోసారి చర్చలకు సిద్ధమైంది. శనివారం సాయంత్రం పార్క్ హయత్ హోటల్లో కూటమి నేతలు సమావేశం కానున్నారు. ఐతే ఈ సమావేశానికి సిపిఐకి పిలుపు రాలేదని చాడ వెంకటరెడ్డి తెలిపారు. ఈ విషయంపై చర్చించేందుకు టిటిడిపి ఎల్. రమణతో సమావేశమయ్యారు. సిపిఐ పార్టీకి కాంగ్రెస్ కేటాయించిన స్థానాలపై కూడా చాడ చర్చించారు. మరోవైపు భాగస్వాయ్య పార్టీలతో చర్చల కోసం తెలంగాణ జన సమితి నేత కోదండరామ్ కూడా రమణ ఇంటికి వెళ్లారు.