కావలిలో చంద్రబాబు పర్యటన..ఫ్లెక్సీల ఏర్పాటును అడ్డుకున్నమున్సిపల్ కమిషనర్

గతంలో కూడా వివాదంలో చిక్కుకున్న శివారెడ్డి

chandrababu

అమరావతిః టిడిపి అధినేత చంద్రబాబు నెల్లూరు జిల్లా కావలిలో పర్యటించబోతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు స్వాగత ఏర్పాట్లలో భాగంగా పార్టీ శ్రేణులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నాయి. అయితే, ఈ ఏర్పాట్లను మునిసిపల్ కమిషనర్ శివారెడ్డి అడ్డుకున్నారు. దీంతో ఆయనపై టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వీరు శివారెడ్డి కమిషనర్ ఇంటిని ముట్టడించారు. వైఎస్‌ఆర్‌సిపి ఫ్లెక్సీలను తొలగించకుండా… టిడిపి ఫ్లెక్సీలను మాత్రమే తొలగించడం ఏమిటని మండిపడ్డారు. గతంలో కూడా మునిసిపల్ కమిషనర్ శివారెడ్డి ఫ్లెక్సీల వివాదంలో చిక్కుకున్న విషయం గమనార్హం.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/category/telangana/