కాళోజీ యాదిలో రవీంద్రభారతి వేదికగా కవితాంజలి

Kaloji Narayana Rao
Kaloji Narayana Rao

హైదరాబాద్‌: నగరంలో రవీంద్ర భారతిలో శనివారం కవితాంజలి కార్యక్రమం జరుగనుంది. ప్రజాకవి కాళోజీ జయంతిని
పురస్కరించుకుని తెలంగాణ జగృతి చేపడుతున్న ఈ కార్యక్రమం ప్రపంచ రికార్డ్‌ దిశగా కొనసాగనున్నట్లు నిర్వహకులు
తెలిపారు. రవీంద్రభారతి కాన్ఫరెన్స్‌ హాల్‌లో శనివారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నిర్విరామంగా
కవితాంజలి కార్యక్రమం జరుగనున్నట్లు వెల్లడించారు. కవితారజలిలో అంశం ఏదైనాగానీ అచ్చు అయిన కవితను మాత్రమే
చదవాలి. కనీసం 5నిమిషాల పాటు కవితను చదవాలి. ఒకవేళ కవిత చిన్నదిగా ఉంటే చదవడం రిపీట్‌ చేయవచ్చు.