కాళోజీ పుర‌స్కారం 2017  ప్రముఖ కవి సీతారాం ఖరారు

Kaloji Narayana Rao
Kaloji Narayana Rao

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం 2017 సంవత్సరానికిగాను కాళోజీ నారాయణరావు పురస్కారాన్ని ప్రకటించింది.
ఈ ఏడాదికిగాను కాళోజీ పురస్కారానికి ప్రముఖ కవి సీతారాంను ప్రభుత్వం ఎంపిక చేసింది. పురస్కారంతో పాటు
రూ.1,01,116ల నగదును సీతారంకు ప్రభుత్వం అందజేయనుంది. ప్రజాకవి, పద్మభూషణ్‌ కాళోజీ నారారయణరావు
జయంతి సెప్టెంబర్‌ 9న తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా
సీతారాంను ప్రభుత్వం సత్కరించి పురస్కారాన్ని అందజేయనుంది. గత ఏడాది ప్రముఖ రచయిత, గాయకుడు గోరేటి
వెంకన్నకు, 2015 సంవత్సరానికిగాను సుప్రసిద్ధ రచయిత అమ్మంగి వేణుగోపాల్‌కు కాళోజీ పురస్కారం వరించిన విషయం
తెలిసిందే.