కాళేశ్వరంపై ఉన్న శ్రద్ధ మరిదేనిపై లేదు

హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని టిడిపి సీనియర్ నేత రావుల చంద్రశేఖర్రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన..రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కార్యదర్శి చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యకరం అని పేర్కొన్నారు. కార్పొరేషన్లతో తీసుకున్న అప్పుల వివరాలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరంపై చూపుతున్న శ్రద్ధ పెండింగ్ ప్రాజెక్టులపై ఎందుకు చూపడం లేదని అన్నారు. పారదర్శకత కోసమే వివి ప్యాట్ స్లిప్పులను ముందుగా లెక్కించాలంటున్నామని స్పష్టం చేశారు. ఏపిలో కచ్చితంగా టిడిపి గెలుస్తుందని రావుల ధీమా వ్యక్తం చేశారు.
తాజా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/latest-news/