కాలేజీ భ‌వ‌నం పైనుంచి దూకి విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌య‌త్నం!

sucide attempt
sucide attempt

వరంగల్ః కాలేజీ బిల్డింగ్‌పైకి వెళ్లిన ఓ విద్యార్థిని అక్క‌డి నుంచి కింద‌కు దూకేసి ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డిన సంఘ‌ట‌న హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఇంట‌ర్ కళాశాలలో జ‌రిగింది. ర‌క్త‌పు మ‌డుగులో ఉన్న ఆమెను లెక్చ‌ర‌ర్లు స‌మీపంలోని ఆసుప‌త్రికి త‌ర‌లించి, చికిత్స అందించారు. ఆ విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న పోలీసులు సంఘ‌ట‌న స్థ‌లానికి చేరుకొని ఆమె ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేయ‌డానికి గ‌ల కార‌ణాల‌పై ఆరా తీస్తున్నారు. దీనిపై పూర్తి స‌మాచారం తెలియాల్సి ఉంది.