కాలుష్య ‘సాగరం’లో కరుగుతున్న కోట్లు

HUSSAIN SAGAR
HUSSAIN SAGAR

కాలుష్య ‘సాగరం’లో కరుగుతున్న కోట్లు

ఉదయం లేదా సాయంత్రం పూట ట్యాంక్‌ బండ్‌ లేదా నెక్లెస్‌ రోడ్డు లేదా హుస్సేన్‌సాగర్‌ పక్క నుంచి మెల్లగా నడుచుకొని వెళ్తుంటే దుర్గంధం ఊపిరాడ నివ్వదు. ఈ చారిత్రాక ‘సాగర్‌ దుర్గాంధానికి,కాలుష్యానికి పర్యా యపదంగా చెప్పుకొంటున్నప్పటికీ, ఈ ఏడాదిలో వేగంగానే భరిం చరాని దుర్గంధం వ్యాపించడం గమనార్హం. ఇటీవలనే ఈ సాగర్‌ పరిశీలనలో సహజత్వాన్ని,నిర్మలత్వాన్ని కోల్పోయినట్టు తేలింది. వేసవితో పాటు సాధారణంగా సాగర్‌ మురిగిపోవడం ఏప్రిల్‌ నాటికి ప్రారంభమవ్ఞతుంది. కానీ ఈసారి భరించలేని దుర్గంధం విస్తరి స్తోంది. దీనికి అనేక కారణాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత ఏడాది సెప్టెంబర్‌లో భారీ వర్షాలు కురవడంతో రసాయనాల మడ్డి సాగర్‌లోకి వేగంగా కొట్టుకు వచ్చింది. వాతావరణం మార డంతో శీతాకాలంలోనే ఉష్ణోగ్రతలు పెరిగి సాగర్‌లో నీరు వేగం గానే ఆవిరైపో వడం జరుగుతోంది.

ఫలితంగా కాలుష్యాల సాంద్రత పెరుగుతోంది. నీటిలో ఆక్సిజన్‌ శాతం తగ్గిసూక్ష్మ జలచరాలు నశిం చడంతో హైడ్రోజన్‌ విడుదలై మరింత దారుణ పరిస్థితిని కల్పిస్తు న్నాయి.ఇది పెద్ద పర్యావరణ సమస్య,దుర్గంధం వేగంగా విస్తరిం చడాన్ని బట్టి వేసవి ప్రారంభం కాక ముందే ‘సాగర్‌ నిర్జీవమవ్ఞ తున్న సూచనలు కనిపిస్తున్నాయి.దీనివల్ల ‘సాగర్‌ లో కాలుష్య భారంచాలా అధికంగా ఉన్నట్టు స్పష్టమవ్ఞతోంది.దుర్గంధం వేగంగా వెలు వడడం ‘సాగర్‌ సంరక్షణ సత్వరం చేపట్టాల్సిన తరుణమన్న హెచ్చ రికని చెప్పవచ్చు.ఈ దుర్గంధం చర్మానికి,కళ్లకు వ్యాధులను సంక్ర మింప చేస్తుందని వైద్యులు వివరిస్తున్నారు. మందులకు ఏమాత్రం లొంగని మొండి బ్యాక్టీరియాకు సాగర్‌ స్థావరమవ్ఞతోం దని అన్నారు. విషపూరిత కాలుష్యాల వల్ల కళ్ల నుండి నీరు కారడం, దురద పుట్టడం, ఎర్రబారడం వంటి అనారోగ్య లక్షణాలు ఏర్ప డతాయి. సాగర్‌ పరిసర ప్రదేశాల్లో లుంబినీ పార్కు, ఎన్టీఆర్‌ గార్డెన్స్‌, ఇందిరాపార్కు, సంజీవయ్య పార్కుల్లో పిక్నిక్‌లు ఏర్పాటు చేసుకునే వారు సన్‌గ్లాస్‌లు వాడడం మంచిదని డాక్టర్లు సూచిస్తు న్నారు. దుర్గంధం వల్ల శ్వాసకోశవ్యాధులు, చర్మవ్యాధులు వస్తా యి.ఎక్కువకాలం ‘సాగర్‌ పక్కనే ఉంటే చర్మం రంగు కూడా మారి పోతుంది. ఎరుబినోసా, షిగెల్లా, స్టెఫిలోకాకస్‌,సాల్మోనెల్లా తదితర పరాన్నజీవ్ఞలైన స్‌ూక్ష్మక్రిములకు ‘సాగర్‌ఆశ్రయమవ్ఞతోంది. ఇవే పరాన్నజీవ్ఞలు సఫిల్‌గూడ,దుర్గం చెరువ్ఞల్లో ఉన్నాయి. దోమల ఉత్పత్తి పెరిగి మలేరియా డెంగ్యూ వ్యాధులు సంక్రమిస్తున్నాయి. సాగర్‌లో బోటు షికారు చేసేటప్పుడు నీటిని తాకకుండా ఉంటేనే మంచిది. ముఖ్యంగా”రాక్‌ఆఫ్‌జిబ్రాట్టర్‌ (సాగర్‌ మధ్యలోని రాయి) వద్ద నీటిని స్శర్శించకూడదు. ఫార్మా, పరిశ్రమలు, రసాయనాలు, మున్సిపల్‌ వ్యర్ధాలు సాగర్‌లో కలియకూడదు.

ప్రమాదక రమ యిన రసాయన మడ్డిని తొలగించి వేయాలి. ఎప్పటికప్పుడు నీటి నాణ్యతను పరీక్షించి,పొల్యూషన్‌ మీటర్లను సాగర్‌లో అమర్చాలి. ప్రజలకు నీటి నాణ్యతను తెలియజేస్తుండాలి. సాగర్‌ సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించాలి. పర్యావరణ చట్టాలను కఠినంగా అమలు చేయాలి. కోట్లరూపాయిలు ధారపోస్తున్నా సాగర్‌ జలాలు శుద్ధి కావడం లేదు. కాలుష్యాల మళ్లింపునకు ప్రత్యేక పైపు లైన్‌ వేసినా వ్యర్ధాలువచ్చి చేరుతున్నాయి.బంజారా, బల్కాపూర్‌, పికెట్‌, కూకట్‌పల్లి నాలాలనుంచి మురుగు నీరు ఇదివరకు ఎక్కువగా చేరేది.ఒకప్పటి మంచినీటి చెరువ్ఞ విషపూరితంగా మారింది. అయితే సాగర్‌ ప్రక్షాళన చేప ట్టిన తరువాత కొంత మార్పు వచ్చినా పూర్తి స్థాయిలో నిర్మలత్వం ఏర్పడలేదు. నాలాల నుంచి వచ్చే వ్యర్థాలను నిరోధించడానికి 10 ఇంటర్‌ సెక్షన్‌ అండ్‌ డైవర్షన్‌ (ఐ అండ్‌డి)లు నాలాలపై నిర్మిం చారు. బల్కాపూర్‌ నాలా నుంచి వచ్చే వ్యర్ధాలను శుద్ధి చేయడానికి ఖైరతాబాద్‌ఫౖౖెవోవర్‌ వద్ద 20 మిలియన్‌ లీటర్ల (ఎంఎల్‌)సామర్ధ్యంలో సీవరేజి ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ (ఎన్‌టిపి) ఏర్పాటు చేశారు. అలాగే కూకట్‌పల్లి నాలా వ్యర్థాలు కలియకుండా ఐఅండ్‌డి (100ఎంఎల్‌ సామర్ధ్యం) నిర్మించినా పూర్తి స్థాయి ఫలితం కనిపించలేదు.మురుగు జలాలు సాగర్‌లోకి కలవ కుండా ఉండడానికి 2200ఎంఎం డయాపైపులైన్‌ ఏర్పాటుచేశారు. నెక్లెస్‌రోడ్డులోని కూకట్‌పల్లి నాలా నుంచి మ్యారియిట్‌ హోటల్‌ వరకు 2.2కిలో మీటర్ల పైపులైన్‌ 40 కోట్లతో నిర్మించడానికి ప్రతి పాధించారు. మొత్తంమీద 36కోట్లతో పూర్తయి ఏడాది కావస్తోంది. అయినా సాగర్‌లో మురుగు నీరు కలుస్తోంది.2.200 ఎంఎం డయా పైప్‌లైన్‌ నుంచి 50 ఎంఎం మురుగునీరు పారించడం అసాధ్యమేమీ కాదు. కానీ కేవలం 80 ఎంఎం మాత్రమే పైప్‌లైన్‌ ద్వారా ప్రవహిస్తోంది. మారియేట్‌ హోటల్‌ నాలా వరకు పైప్‌లైన్‌ వేసి మురుగుజలాలు అందులో కలపాలి. అయితే పూర్తిస్థాయిలో పైపులు వేయకుండా రోడ్డు దాటగానే కాలువ ద్వారా దిగువకు వదిలారు. దీంతో వ్యర్థాలు పేరుకుపోయి సాఫీగా ప్రవాహం సాగడం లేదు.

పైప్‌లైన్‌ నుంచి నీటి ప్రవాహం సరిగ్గా సాగక నీటి రాక తగ్గుతోంది. గత ఏడాది ఎన్టీఆర్‌మార్గ్‌లో సీవరేజీ పైప్‌లైన్‌ పగిలి రోడ్డు కుంగిపోయింది. దీంతో ఆ పైప్‌లైన్‌కు రావలసిన మురుగునీటిని ఎగువ యశోధ ఆస్పత్రి వద్ద ఉన్న ఐఎన్‌డి నుంచి కూకటపల్లి నాలాలకు మళ్లించారు. ఇప్పటికే ఆ నాలాలోకి వ్యర్థ జలాలు వెళ్తుండడంతో సాగర్‌ కలుషితమవ్ఞతోంది. నెక్లెస్‌ రోడ్డులో మరో ఐఎన్‌డి నిర్మిస్తే పైప్‌లైన్‌లోకి వ్యర్థజలాలు పూర్తిగా వెళ్తాయని అంటున్నారు.నాలా నుంచి పైపులైన్లలోకి కలపాల్సిన నిర్మాణం సరిగ్గా లేనందునే ఇలా జరుగుతోందన్న వ్యాఖ్యలు వస్తున్నాయి.

ఇస్నాపూర్‌ సరస్సులో కాలుష్యం హైదరాబాద్‌ శివారు లోని పరిశ్రమలను తెలంగాణరాష్ట్ర కాలుష్య నివారణ మండలి (టిఎస్‌ పిసి బి)మూసి వేయించింది. ఇస్నా పూర్‌ చెరువ్ఞలో కాలుష్యాలను విడిచి పెడుతున్నారని ఈపరిశ్ర మలపై ఆరోపణలు రావడంతో కాలుష్య నివారణ విభాగం రంగంలోకి దిగింది. ఈ కాలుష్యంవల్ల వేలాది మత్స్యసంపద నాశనమవ్ఞతుం దని ఫిర్యాదులు వచ్చాయి. నగర పొలి మేరల్లో పశ్చమైలారం ఇండస్ట్రియిల్‌ డెవలప్‌మెంట్‌ ఏరియాలో 200ఎకరాల ఇస్నాపూర్‌ సరస్సులో చేపలన్నీ నశించిపోయాయని కొన్నిరోజులు క్రితం స్ధానికుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై కాలుష్య నివారణ అధికార యంత్రాంగం దర్యాప్తు చేపట్టింది. సరస్సునీటి నమూనా లు పరీక్షించారు. ప్రాథమిక ఆధారాల ప్రకారం సరస్సు ప్రాంతంలో ఉన్నవారు పరిశ్రమలను మూసివేయించారు.సరస్సు నీటి నమూనా లతో పాటు అలాగే పరిశ్రమల నుంచి విడుదలవ్ఞతున్న కాలుష్యాల నమూనాలను కూడాపరిశీలించారు. పశ్చమైలారం ఇండస్ట్రీయల్‌ ఏరియాలో 192పరిశ్రమలు ఉన్నాయి. ఈ సరస్సు, కాలుష్య స్థావ రంగా పేరుపడింది. అయితే గత రెండేళ్లలో ఈ సరస్సు అభివృద్ధి చెందడంతో చేపలను మత్స్యకార్మికులు పెంచ డం ప్రారంభించారు. అయితే ఇప్పటి కాలుష్యం వల్ల దాదాపు 50లక్షల విలువైన మత్స్య సంపదకు నష్టంవాటిల్లిందని స్థానిక మత్స్యకార సంఘానికి చెందిన 50మంది సభ్యులు ఆరోపిస్తున్నారు. మత్స్య కార్మికులు రాష్ట్రప్రభు త్వం ఆమోదంతో ఈ సరస్సులో చేపల పెంపకాన్ని చేపట్టారు.

గత సీజన్‌లో ఈ సరస్సు పూర్తిగా ఎండిపోయింది.మత్స్యకార్మికు లు 2లక్షల చేపపిల్లల విత్తనాలను చెరువ్ఞలో విడిచిపెట్టారు. ఈ మే రకు ప్రభుత్వం వీటిని సరఫరా చేసింది. రెండు నెలల క్రితం పారి శ్రామికవేత్తలతో మత్స్యకారులతో సంయుక్తసమావేశం ఏర్పాటైంది. సరస్సులో ఎలాంటి రసాయన కాలుష్యాలను విడుదల చేయ బోమని పరిశ్రమల అధినేతలు హామీ ఇచ్చిన తరువాతనే మత్స్యకా రులు చేపల పెంపకాన్ని చేపట్టారు. రెండు వారాల క్రితం వరకు ఈ సరస్సు శుభ్రంగా, నిర్మలంగా ఉండేది. అయితే కొన్ని రోజుల నుంచి పరిశ్రమల కాలుష్యాలు వచ్చి చేరడం జరుగుతోంది.

-పెట్ల వెంకటేశం