కాలుష్య రహిత రవాణాకు జల రవాణా ఎంతో కీలకం: చంద్రబాబు

AP CM Babu
AP CM Babu

కాలుష్య రహిత రవాణాకు జల రవాణా ఎంతో కీలకం:

విజయవాడ :కాలుష్య రహిత రవాణాకు జల రవాణా ఎంతగానో దోహదపడుతుంద చంద్రబాబునాయుడు న్నారు. అంతే కాకుండా జల రవాణా చాలా చౌక అని చెప్పారు. ఇక్కడి ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతున్న సభలో ఆయన మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో చేపట్టే ఎన్నో  జాతీయ  కార్యక్రమాలను కేంద్రం చేపట్టిందని ఆయన చెప్పారు.ఈ కార్యక్రమానికి మన శ్రేయోభిలాషిగా, విభజన సమయంలో మనకు ఎంతో సహకారం చేసిన వ్యక్తిగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా జరగాలని భావించి పట్టుబట్టి ఆయనను ఆహ్వించి తీసుకువచ్చామని చంద్రబాబు చెప్పారు. అలాగే రాష్ట్రంలో రాహదారి, జల రవాణా కార్యక్రమాలకు శంకుస్థాన చేసిన గడ్కరీ చేతుల మీదుగానే ఈ రహదారి పనులు ప్రారంభం కావాలని భావించామని, వారు వచ్చినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ణతలు చెబుతున్నానని చంద్రబాబు అన్నారు