కాలుష్యమయంగా పర్యాటక ప్రాంతాలు :

ప్రజావాక్కు

Pollution Near Tourism places
Pollution Near Tourism places

 

కాలుష్యమయంగా పర్యాటక ప్రాంతాలు : సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

దేశంలో అనేక పర్యాటక ప్రాంతాలు కాలుష్యం బారిన పడు తున్నాయి.మితిమీరిన అభివృద్ధి,అక్రమాలు, ప్రకృతివనరులను యధేచ్ఛగా వాడేయడం వంటిచర్యలపై ప్రభుత్వపరంగా అడ్డూ, అదుపు లేకుండాపోతోంది.తాజాగా తమిళనాడులో ప్రకృతి రమ ణీయతకు నిలయమైన నీలగిరినదులు, సరస్సులు కాలుష్యం బారినపడి పర్యాటకరంగానికి తీవ్రముప్పు కలుగుతోందన్న యునెస్కో నివేదికపై ప్రభుత్వం తక్షణం స్పందించాలి. రసా యన వ్యర్థాలు, మురుగు నీరు కలుస్తున్నందున కొన్ని సరస్సు లు మురికి కూపాలుగా మారుతున్నాయని ఇక్కడ కొలిఫామ్‌ బ్యాక్టీరియా ప్రమాదకరస్థాయికి చేరుకుందన్న నివేదికలు ఆందో ళన కలిగిస్తున్నాయి. ఇటువంటి అనాలోచిత,చట్ట వ్యతిరేక ప్రక్రి యలు దశాబ్దాలుగా నిరాటంకంగా సాగుతున్నా అధికారులు, ప్రభుత్వం పట్టించుకోకుండా ఉండడం బాధాకరం.

మత్తు పదార్థాలపై నిషేధం: ఎన్‌. ఏడుకొండలు,విశాఖ జిల్లా

విశాఖ నగరంలో మత్తుపదార్థాల విక్రయం జోరుగా సాగుతు న్నందునయువత వీటికి బానిస అవ్ఞతున్నారు. ప్రభుత్వం నిషే ధించిన గుట్కా,పాన్‌పరాగ్‌ వంటివి కిళ్లీకొట్టులో యధేచ్ఛగా విక్ర యిస్తుండగా, సిగరెట్‌, కిళ్లీల్లో కొన్ని రకాల మత్తుపదార్థాలను ఉంచి అందిస్తున్నారు. కాలేజీ హాస్టళ్లలో గంజాయి, హెరాయిన్‌ వంటి హానికరమత్తుపదార్థాలు యధేచ్ఛగా లభ్యం అవ్ఞతున్నా యని ఇటీవలే పత్రికలలో కథనాలు వెలువడ్డాయి. నగర శివా ర్లు, హైవేల పక్కన, బీచ్‌రోడ్‌ వంటి ప్రాంతాలలో చీకటిపడ్డాక యువతే బృందాలుగా ఏర్పడి వీటిని సేవిస్తున్నా అధికారులు, పోలీసులు పట్టించుకోవడం లేదు. ఇక మద్యం షాపుల ద్వారా ఇరవైనాలుగు గంటలు, సంవత్సరం పొడవ్ఞనా మద్యంతోపాటు మత్తుపదార్థాలు లభ్యం అవ్ఞతున్నాయి. వీటిని అధికంగా సేవిం చడం వలన నోటి క్యాన్సర్‌తోపాటు జీవితం అర్థాంతరంగా ముగిసే ప్రమాదం ఉన్నా యువత పట్టించుకోవడం లేదు.

అక్రమార్కులను నియంత్రించాలి: యర్రమోతు ధర్మరాజు, ధవళేశ్వరం

తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన పిదప విచ్చలవిడిగా జరుగుతున్న ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టడం, పట్టు కున్న దుంగలకు వేలం పాటల ద్వారా వందల కోట్ల ఆదాయం సమకూరడం జరిగింది. పాలన చేపట్టి మూడేళ్లు అయినా నేటికీ అక్రమార్కులు యధేచ్ఛగా చెట్లు నరికి తరలించుకుపోవడం సరిహద్దులు దాటించి ప్రభుత్వానికి జమకావలసిన సొమ్ము అక్రమార్కుల గళ్లా పెట్టెకు జమవ్ఞతుంది. వారంలో ఏదో ఓ ముఠాను పట్టుకుని న్యాయస్థానాలకు అప్పగించి చేతులు దులుపుకుంటున్నారు అధికారులు. ఎర్రచందనం చెట్లు ఉన్న ప్రదేశల్లో గస్తీ ఏర్పాటు చేసి, చెక్‌పోస్టుల వద్ద నిజాయితీ గల అధికారులను నియమించి వారికి సరైన ఆయుధాలు, రక్షణ కల్పించినట్లయితే అక్రమార్కులను ఆదిలోనే నియంత్రించవచ్చు.

ప్రజాధనం దుర్వినియోగం: ఎం.కనకదుర్గ,తెనాలి, గుంటూరుజిల్లా

తెలుగు రాష్ట్రాలలో పాలకులు, అధికారులు, సభలు, సదస్సు లు, సమావేశాలు అధ్యయన యాత్రల పేరిట విచ్చలవిడిగా ప్రజా ధనాన్ని ఖర్చు చేయడంపై ఇటీవల కాగ్‌ తన నివేదికలో తప్పు పట్టింది. ఎన్నడూ లేనంతగా బిజినెస్‌ కోసమని మంత్రులు గుంపు లు గుంపులుగా విదేశీయాత్రలు చేయడం, తద్వారా లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులు వస్తున్నాయంటూ ఆర్భాటపు ప్రకటనలు చేస్తు న్నారు.అయితే వాస్తవంగా ఎన్ని కోట్లు పెట్టుబడులు వచ్చా యనే విషయాలపై ఎక్కడా సమాచారం లభించడం లేదు. పలు రకాల నామినేటెడ్‌ పదవ్ఞలను తమ పార్టీని నమ్ముకున్న వారికి కట్టబెట్టి వారికి తగు ప్రొటోకాల్‌ పాటించడం వలన ప్రభుత్వ ఖజానాపై పెను భారం పడుతోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల లో ఉన్న మండల పరిషత్‌ వలన ఎటువంటి ప్రయోజనం ప్రజలకు లేదు.

కరాటే తప్పనిసరి చేయాలి: షేక్‌ అస్లాం షరీఫ్‌, శాంతినగర్‌
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థినులకు తప్పనిసరిగా కరా టే నేర్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. నేటి పరిస్థి తుల్లో మహిళలు, ఆడపిల్లలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రు. ఆడపిల్లలు పాఠశాలలకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకునేవరకు తల్లిదండ్రులకు భయాందోళనలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం వివిధ పథకాలకు ఎన్నో కోట్ల నిధులను కేటాయిస్తుంది. అలాగే విద్యా శాఖకు కేటాయించి కరాటే కోసం వినియోగించాలి.

యాచకులను ఆదుకోవాలి: ఎన్‌.విజయసాయి, నల్గొండ
తెలంగాణ ముఖ్యమంత్రి రాష్ట్రంలోని అన్ని కులవృత్తులకు ప్రాధాన్యమివ్వటం సంతోషించదగ్గ విషయం. ఏ వృత్తిలో నైపుణ్య ముంటే ఆ వృత్తిదారులను ఆదుకుంటున్నారు.అలాగే గ్రామాల్లో నగరాల్లో అనేక చోట్ల పేద బాలల భిక్షాటన సర్వసాధారణ దృ శ్యంగా మారింది.రోడ్లపక్కన, ఫ్లాట్‌ ఫారమ్‌లపై నివాసముంటున్న జనసమ్మర్ధ ప్రదేశాలలో యాచకవృత్తిని కొనసాగిస్తున్నారు. ఈ వర్గాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్న బిచ్చగాళ్లకు ఉపాధి, పునరావాసం కల్పించాలి.

సమానత్వాన్ని స్వాగతిద్దాం: బి.ఎన్‌.సత్యనారాయణ, హైదరాబాద్‌
దేశం దారి మళ్లుతోంది. సహనాన్ని, సమానత్వాన్ని తుంగలో తొక్కుతోంది. ఆచారాలు, సాంప్రదాయాలు ఉద్ధరణ పేరుతో కొత్త పుంతలు తొక్కుతోంది. కుళ్లి గబ్బుకొడుతున్న అంధవిశ్వాసాలకు అత్తరులుపూస్తోంది. సమాజాన్ని చీకటి లోకి నెట్టేందుకు ప్రయత్ని స్తోంది.మతకలహాలకు, కుల ఘర్షణలకు మార్గాలు వేస్తోంది. యా గాలకు, ప్రాపకాలు కల్పిస్తూ ప్రజలను ప్రలోభపరిచే ప్రయత్నాలు చేస్తోంది. మానవ సంక్షేమానికి మాసికలు వేస్తోంది. మూఢవిశ్వా సాలకు మెరుగులుదిద్దుతోంది. దీనితో మతశక్తులు విజృంభిస్తున్నా యి. మాఫియాల్లా సమాజంపై దాడులు ఆరంభించాయి. వాటిని కట్టడి చేయాల్సి ఉంది. మతపరమైన ఆలోచనల నుండి మానవ త్వంవైపు వారిని మరల్చాల్సిఉంది.