కాలిఫోర్నియా ..ఉపాధ్యాయుల సమ్మె

Teachers Strike
Teachers Strike

కాలిఫోర్నియా : కాలిఫోర్నియా శాంతాక్రజ్‌ యూనివర్సిటీ (యుసిఎస్‌సి) గ్రాడ్యుయేట్‌ టీచింగ్‌ అసిస్టెంట్లు తమ వైల్డ్‌కాట్‌ స్ట్రైక్‌ (యూనియన్‌ అనుమతి లేకుండా జరిపే సమ్మె)ను చేశారు. ఈ సమ్మెకు కాలిఫోర్నియా వ్యాప్తంగా మద్దతు లభించింది. కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన మరో 9 ఇతర కాంపస్‌లలో కూడా సంఘీభావ సమ్మె జరిగింది. సమ్మె చేస్తున్న టీచింగ్‌ అసిస్టెంట్లు తిరిగి విధుల్లోకి చేరని వాళ్లను తొలగిస్తానని యూనివర్సిటీ అధ్యక్షుడు, ఓబామా హోంలాండ్‌ మాజీ సెక్యూర్టీ సెక్రటరీ జనెత్‌ నాపోలిటనో బెదిరించడం, విద్యార్థులపైకి పోలీసులను ఉసిగొల్పటానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది అండర్‌ గ్రాడ్యుయేట్‌ విద్యార్థులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. హాస్టల్‌ విద్యార్ధుల కోసం భరించిన అధిక అద్దెలు, ఇతర ఖర్చుల కింద నెలకు 1,412 డాలర్లు సర్దుబాటు ఖర్చులను చెల్లించనందుకు దాదాపు 200 మంది ఫైనల్‌ గ్రేడ్‌ యూసిఎస్‌ విద్యార్థులను విత్‌హెల్డ్‌లో ఉంచారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/